iDreamPost

అమెరికాలో రూ.300 కోట్లతో భద్రాద్రి తరహాలో రామాలయం!

రాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎట్టకేలకు నెరవేరింది. హిందువులు ఐదు శతాబ్దాలుగా నిరీక్షించిన కల సాకారం అయింది. అయితే, దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాచలం ఆలయాన్ని పొలిన రామాలయాన్ని అమెరికాలో నిర్మించడం చెప్పుకోదగ్గ విశేషం.

రాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎట్టకేలకు నెరవేరింది. హిందువులు ఐదు శతాబ్దాలుగా నిరీక్షించిన కల సాకారం అయింది. అయితే, దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాచలం ఆలయాన్ని పొలిన రామాలయాన్ని అమెరికాలో నిర్మించడం చెప్పుకోదగ్గ విశేషం.

అమెరికాలో రూ.300 కోట్లతో భద్రాద్రి తరహాలో రామాలయం!

ఎంతో మందికి ఆదర్శ మూర్తి శ్రీరామ చంద్రుడు. ఆయన పాలన, ఆయన సంసారం జీవనం అందరికీ ఆదర్శం. ఇక  కోట్లాడి మంది హిందూవులు ఏళ్ల తరబడి ఎదురు చూసిన అపూర్వ ఘట్టం రెండు నెలలక్రితం ఎంతో ఘనం జరిగిన సంగతి తెలిసిందే. జనవరి నెలలో శ్రీరాముడు  అయోధ్యలోని తన మందిరంలో కొలువు దీరారు. ఈ  అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది అయోధ్యకు చేరుకున్నారు. ఆ వేడుకను తలనచుకుని సంతోషంలో ఉన్న హిందూవులకు మరో శుభవార్త వచ్చింది. అమెరికాలో కూడా శ్రీరాముడికి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయం తరహాలో ఈ గుడి నిర్మాణం జరుగుతోంది.

గోదావరి నది తీరంలో భద్రాచలంలో సీతా సమేవేత శ్రీరామచంద్రస్వామి కొలువై ఉన్నారు. ఈ గుడిని భక్త రామదాసు  నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుంది. భక్త రామదాసు ఎన్నో ఇబ్బందులు పడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక అచ్చం ఇదే భద్రాద్రి దేవస్థానం తరహాలో అమెరికాలో కూడా శ్రీరాముడికి గుడి నిర్మిస్తున్నారు. అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మిస్తున్నారు. ఈ మేరకు అక్కడ ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచం నలుమూలల నుంచి దాతలు ఇస్తున్న విరాళంతో గుడి నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు. మొత్తం 33 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో ఆలయ పనులు చేపట్టినట్లు అర్చకులు వివరించారు. ఆలయంలో ఏర్పాటు చేసే శిల్పాలను ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారు చేయిస్తున్నారు. నంద్యాలలో పనులను పర్యవేక్షించాడని తోటి అర్చకులతో కలిసి పద్మనాభాచార్యలు ఇక్కడకు వచ్చారు.

Bhadradri-style Ram temple in America 1

ఈ సందర్భంగా పద్మనాభాచార్యులు మీడియాతో మాట్లాడుతూ.. అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రధాన ఆలయ విడిభాగాలను మాత్రం ఆళ్లగడ్డలో స్థపతులు నిర్మిస్తున్నారని చెప్పారు. ఇక్కడ శిల్పాలు చెక్కడం పూర్తయ్యాక విమానంలో అమెరికాకు తరలించనున్నట్టు పేర్కొన్నారు. 2024 ఆగస్టు 17న ఖగోళయాత్రను అయోధ్య నుంచి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ యాత్ర సెప్టెంబరు 17 వరకు సాగుతుందని ఆయన వివరించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, కాలిఫోర్నియా, ఐస్‌లాండ్‌, జపాన్‌, అలస్కా వంటి దేశాలకు విగ్రహాలను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి శాంతి కళ్యాణాలను నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.

2016 జనవరిలో రామాలయ నిర్మాణం తలంపు వచ్చినట్టు తెలిపారు. అలానే మే 10, 2018 నాడు ఈ ఆలయ నిర్మాణానికి 33 ఎకరాల భూమి లభించిందని వివరించారు. మొత్తంగా అతి త్వరలో భద్రాద్రి తరహాలో అమెరికాలో కూడా శ్రీరాముడి ఆలయం ప్రారంభం కానుంది. దీంతో అక్కడ ఉండే హిందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న శ్రీరాముడి ఆలయ నిర్మాణ పనులపై ప్రధాన అర్చకులు చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి