iDreamPost

Telangana: దైవాన్నీ వదలని స్మగ్లర్స్.. వీళ్లు మామూలోళ్లు కాదు..!

  • Published Dec 13, 2023 | 7:32 PMUpdated Dec 13, 2023 | 7:32 PM

దైవభక్తి పేరుతో మోసాలు చేసేవారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగిపోతోంది. అలాంటి మరో మోసం తాజాగా బయటపడింది. దైవాన్ని కూడా వదల్లేదు కొందరు స్మగ్లర్స్.

దైవభక్తి పేరుతో మోసాలు చేసేవారి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగిపోతోంది. అలాంటి మరో మోసం తాజాగా బయటపడింది. దైవాన్ని కూడా వదల్లేదు కొందరు స్మగ్లర్స్.

  • Published Dec 13, 2023 | 7:32 PMUpdated Dec 13, 2023 | 7:32 PM
Telangana: దైవాన్నీ వదలని స్మగ్లర్స్.. వీళ్లు మామూలోళ్లు కాదు..!

‘మేడి పండు చూడ మేలిమై యుండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అని వేమన పద్యంలో చెప్పినట్టు.. పైకి మన కళ్లకు కనిపించేవన్నీ సత్యాలు కావు. ఇప్పటివరకు దైవభక్తి పేరుతో జనాలను మోసం చేసే కొంతమంది స్వామీజీల గురించి విన్నాం. కానీ, ఇక్కడ ఓ ముఠా దేవుడ్ని అడ్డం పెట్టుకొని ఏకంగా కొన్ని రూ.లక్షలు విలువ చేసే గంజాయిని తరలించేస్తోంది. సాధారణంగా దేవుడి ప్రచార రథాలు వీధుల్లో అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఈ ముఠా కూడా అదే తరహాలో రథానికి ఇరువైపులా దేవుడి ఫ్లెక్సీలను పెట్టి లోపల మాత్రం గంజాయిని తరలిస్తూ పోలీసుల కంట పడ్డారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు.. హరియాణాకు చెందిన మున్షిరాం, బగతా, గోవింద్ అనే వ్యక్తులు తక్కువ టైమ్​లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకున్నారు.

మున్షీరాం, బగతా, గోవింద్​లు గంజాయి సరఫరాను వ్యాపారంగా మలుచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ బిజినెస్​ కోసం ఏకంగా దైవాన్నే అడ్డుగా పెట్టుకున్నారు. సాధారణంగా ఎక్కడైనా ఏదైనా దేవుడి విగ్రహం కానీ.. ఫోటో కానీ కనిపిస్తే చాలా మంది ఆగి మరి దండం పెట్టుకుంటారు. అలా దైవం పేరు చెప్పి భక్తులమని నమ్మించి మోసం చేసేవారు కూడా ఉన్నారు. దీన్ని ఈ ముఠా అదునుగా తీసుకొని దేవుడి ఫోటోల మాటున గంజాయి వ్యాపారం స్టార్ట్ చేసింది. ఒక ఆటోకు ఓ వైపు షిరిడీ సాయి బాబా ఫోటో.. మరోవైపు ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి అందంగా అలంకరించారు. లోపల అమ్మవారి విగ్రహం కూడా పెట్టి ఉంచారు. కానీ, అందులోనే రూ.1.20 కోట్ల విలువ చేసే 484 కేజీల గంజాయి కూడా ఉంది. ఈ రకంగా దేవుడి రథంలో గంజాయి తరలిస్తూ భద్రాచలం పోలీసులకు ఈ ముఠా అడ్డంగా దొరికిపోయింది. వీరి గంజాయి తరలించే విధానం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు.

ఈ ముఠా ఒడిశా సరిహద్దుల్లో ఉండే కలిమేర ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి.. హరియాణాలో ఉన్న వ్యక్తులకు అమ్మడానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు చేసేటప్పుడు పోలీసులకు చిక్కారు. వీరి దగ్గర నుంచి 484 కిలోల గంజాయి, ఒక ఆటో, రెండు మొబైల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు కోటి ఇరవై లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు. భద్రాచలం CI నాగరాజు నిందితులను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏదేమైనా దేవుడ్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి అక్రమ వ్యాపారాలు ఎన్నో చేస్తున్నారు. కాబట్టి భక్తి పేరుతో మోసం చేసేవారిని ఓ కంట కనిపెడుతూ ఉండడం మంచిది. మరి.. దేవుడి ప్రచార రథంలో గంజాయిని తరలిస్తూ పట్టుబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెక్రటరీతో టెక్ సంస్థ CEO ఒప్పందం! ఎప్పుడు మూడొచ్చినా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి