iDreamPost

KGFని పఠాన్ దాటడం సాధ్యమేనా?

KGFని పఠాన్ దాటడం సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఏ బాలీవుడ్ మూవీకు జరగనంత భారీ అడ్వాన్స్ బుకింగ్ పఠాన్ కు కనిపిస్తోంది. మొదటి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం ఆటలకు డిమాండ్ తట్టుకోలేక ఎగ్జిబిటర్లు ఇతర సినిమాలు ఆడుతున్న స్క్రీన్లను ఎక్కువ రేట్ మాట్లాడుకుని మరీ బ్లాక్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ట్రెండ్ మాములుగా లేదు. ఇప్పటిదాకా ఫిక్స్ చేసిన షోలు తెలుగులో ఏ పెద్ద హీరోకు తీసిపోవనే స్థాయిలో ఉన్నాయి. షారుఖ్ ఖాన్ అభిమానులు నాలుగేళ్ల తర్వాత వస్తున్న తమ హీరో సినిమా కావడంతో భారీ ఎత్తున స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెల్లవారుఝామున బెనిఫిట్ షోలను సైతం డిమాండ్ చేయడం కనిపిస్తోంది

ఇప్పటిదాకా మూడు లక్షల పైగా టికెట్ల అమ్మకాలతో ఇరవై కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. పఠాన్ లక్ష్యం కెజిఎఫ్ 2ని దాటడం. దాని పేరు మీద అయిదు లక్షలకు పైగా అడ్వాన్స్ సేల్స్ తో నెంబర్ వన్ రికార్డు ఉంది. ఇంకా మూడు రోజుల టైం అది కాబట్టి ఈజీగా దాన్ని దాటేస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. పరిస్థితి చూస్తుంటే నిజమయ్యేలానే ఉంది. హిందీకి ఎగబడుతున్నారు కానీ తెలుగు సహా డబ్బింగ్ వెర్షన్లకు ఏమంత ఆశించిన స్పందన కనిపించడం లేదు. షారుఖ్ ఆసలు గొంతులో అయితేనే సినిమాని ఎంజాయ్ చేయగలమన్న ఫీలింగ్ తో అందరూ ఒరిజినల్ కే ఎక్కువగా ఓటేస్తున్నారు.. సో అనువాదాలకు పెద్ద రెస్పాన్స్ ఉండకపోవచ్చు.

ముందస్తు అంచనాల ప్రకారం పఠాన్ ఫస్ట్ డే గ్రాస్ సులభంగా వంద కోట్లు ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ టాక్ పాజిటివ్ వస్తే మాత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే టార్గెట్ ఉంది. కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లను దాటే అవకాశం మాత్రం దాదాపుగా లేనట్టే. ఎందుకంటే అవి చెరో 1200 కోట్లు వసూలు చేశాయి. అంత మొత్తం రాబట్టాలంటే క్లాస్ మాస్ ని ఆకట్టుకునే ఓ రేంజ్ హీరోయిజం, విజువల్ గ్రాండియర్ నెస్, ఎమోషన్లు ఉండాలి. పఠాన్ లో ఇవి ఉన్నట్టే తెలుస్తున్నా స్టోరీ లైన్ మాత్రం పాతదే అనిపిస్తోంది. గతంలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మరి రిపబ్లిక్ డే టైంలో షారుఖ్ సగర్వంగా సక్సెస్ జెండా ఎగరేస్తాడా లేదా చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి