iDreamPost

తప్పుడు వార్తలపై ఫిర్యాదులు.. ముక్కుతాడు పడుతుందా ?

తప్పుడు వార్తలపై ఫిర్యాదులు.. ముక్కుతాడు పడుతుందా ?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధార వార్తలు రాస్తున్న మీడియా, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డిజిపికి ఫిర్యాదు చేసింది. కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ఎల్లోమీడియా తనిష్టం వచ్చినట్లు వార్తలు, కథనాలు అచ్చేస్తోంది. చిన్న చిన్న విషయాలను కూడా బూతద్దంలో చూపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బురద చల్లేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

నిజానికి పోలీసులు, వేలాది మంది వైద్య, ఆరోగ్య సిబ్బందితో పాటు క్షేత్రస్ధాయిలో లక్షలాదిమంది వాలంటీర్లు, ఆశావర్కర్లు 24 గంటలూ పనిచేస్తున్నారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించటం, వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించటంలోను ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి నేపధ్యంలో ఎక్కడైనా అక్కడక్కడ చిన్న లోపాలుంటే ఉండవచ్చు. అలాగే వైరస్ పరీక్షల నిర్వహణ విషయంలో కూడా వీలైనంతమందికి ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది.

మొదట్లే ఏమో ప్రజలందరికీ పరీక్షలు చేయించటం లేదంటూ కథనాలు ఇచ్చారు. ఇపుడు పరీక్షలు చేయించేందుకు లక్ష కిట్లను తెప్పించి పరీక్షలు చేయటం మొదలుపెట్టారు. దాంతో పరీక్షలు చేయటాన్ని వదిలిపెట్టి టెస్టు కిట్ల కొనుగోలులో అవినీతి అంటూ మొదలుపెట్టారు. అంటే ఎల్లోమీడియా వ్యవహారం ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా తయారైంది. పైగా ఎల్లోమీడియా రాస్తున్న కథనాలు, వార్తల్లో ఎక్కడ కూడా ప్రభుత్వ తరపున క్లారిఫికేఫన్ తీసుకోకుండా తమిష్టప్రకారం తాము వాసేస్తున్నారు.

ఇక్కడ అందరికీ అర్ధమవుతున్నదేమంటే ప్రభుత్వంపై వీలైనంతగా బురద చల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. టిడిపి లేకపోతే మరో రాజకీయ పార్టీ అంటే రాజకీయమే లక్ష్యంగా ఉంటాయి కాబట్టి ఏదోలే అనుకోవచ్చు. కానీ సమాజ హితం కోరాల్సిన మీడియా కూడా రాజకీయపార్టీలకు మద్దతుగా ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయకూడదన్న కనీస ఇంగితం కూడా లేకపోయింది. అందుకనే విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల మానసికస్ధైర్యం దెబ్బ తీసేట్లుగా వార్తలు, కథనాలు ఇస్తున్న మీడియా, సోషల్ మీడియాపై విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుతో పాటు తప్పుడు కథనాలు, వార్తల క్లిప్పింగులను కూడా జత చేసింది. మరి డిజిపి ఏమి చేస్తాడో చూద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి