iDreamPost

బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు…50 మంది ప్రయాణికులు!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు.

బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు…50 మంది ప్రయాణికులు!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో  రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, మద్యం మత్తుల్లో డ్రైవ్ చేయడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. ఈ రోజు ఉదయం అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకా వారి పాలెం వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. మేకావారిపాలెం వద్ద అదుపుతప్పి పంట పొలాల్లోకి ఆర్టీసీ బస్సు వెళ్లి.. పల్టీ కొట్టింది. చల్లపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా బస్సు మేకా వారి పాలెం వద్ద ఈ ప్రమాదానికి గురైంది. అయితే.. ఆర్టీసీ బస్సు పంట పొలాల్లో పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.

ఈ ప్రమాదాన్ని స్థానికులు గుర్తించి.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగి కాపాడారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంతేకాక ప్రమాదంలో గాయపడిన వారిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. బస్సు ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో ప్రయాణికులు బయటపడ్డారు. ప్రయాణికులందరూ సురక్షితం కావటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక చోట జరుగుతునే ఉన్నాయి. గతంలో ఓ బస్సు బ్రేక్స్ ఫెయిల్ కావడంతో ప్రయాణికుల పైక దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. బస్ స్టేషన్ లోనే ఈ ప్రమాదం జరగడం గమన్హరం. అలానే నిన్న రాత్రి అనంతపురంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరి.. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియేజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి