iDreamPost

టార్గెట్ రవితేజ! ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువ అయ్యారా?

మాస్ మహరాజా నటించబోతున్న తదుపరి చిత్రం #RT4GM. ఈ సినిమాకు బడ్జెట్ పరమైన సమస్యలు తెలత్తినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కారణంగా షూటింగ్ ఆలస్యమైనట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

మాస్ మహరాజా నటించబోతున్న తదుపరి చిత్రం #RT4GM. ఈ సినిమాకు బడ్జెట్ పరమైన సమస్యలు తెలత్తినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కారణంగా షూటింగ్ ఆలస్యమైనట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

టార్గెట్ రవితేజ! ఇండస్ట్రీలో శత్రువులు ఎక్కువ అయ్యారా?

మాస్ మహారాజ ‘రవి తేజ’ ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఈ హీరో.. దర్శకుడు గోపీచంద్ తో కలిసి ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ‘డాన్ శీను’, ‘బలుపు’,’క్రాక్’ లాంటి హిట్ చిత్రాల తర్వాత.. గోపీచంద్, రవి తేజ కాంబినేషన్ లో వస్తున్న 4వ చిత్రం #RT4GM. అయితే, ఆదిలోనే హంసపాదు అన్నట్లు మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకముందే.. ఈ చిత్రం పైన రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. దానికి కారణం ఎవరై ఉంటారు! రవితేజకి శత్రువులు ఎక్కువ అయ్యారంటూ.. సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఆన్సర్ వినిపిస్తోంది. అజాతశత్రువైన మాస్ మహారాజాని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన సినిమా రిజల్ట్స్ పై మాత్రమే పెద్ద చర్చ పెడుతుంది ఎవరు? వంటి అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో ‘రవి తేజ’. నటించిన ప్రతి చిత్రంలోనూ తనదైన గ్రేస్ ను కనబరుస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజుగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో #RT4GM చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందించనుంది. సంగీత దర్శకుడిగా ‘తమన్’ వ్యవహరించనున్నాడు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. అయితే.., ఈ చిత్రం పైన తాజాగా కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో వచ్చిన రవితేజ సినిమాలు అంతగా వసూళ్లను రాబట్టలేదు. కాబట్టి మాస్ మహారాజుపై భారీ బడ్జెట్ కష్టమేనని.. నిర్మాతలు భావిస్తున్నారనే వార్తలు వచ్చాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు మరోసారి చర్చలు జరిపిన తర్వాత మాత్రమే షూటింగ్ స్టార్ట్ చేస్తారంటూ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇది ఇలా ఉండగా.. సినిమా ఎట్టి పరిస్థితిలో ఆగిపోదని, స్క్రిప్ట్ విషయంలో కాస్త ఆలస్యమైన కారణంగా షూటింగ్ లేట్ అయిందని.. అనుకున్న సమయానికే అంత సిద్ధం చేస్తారని.. మరి కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. వీటిలో ఏది వాస్తవం అనేది ఎవరికీ తెలీదు.

#RT4GM గురించి ఇంత చర్చ జరగడమే అనేక అనుమానాలకు కారణం అవుతోంది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మేకర్స్ మౌనంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్న సమయంలో రవితేజని ఇబ్బంది పెట్టడానికే ఈ వార్తలు పుట్టించారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఇండస్ట్రీలో బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా కామన్. దాని ఆధారంగానే ఏ సినిమాలనైనా పట్టాలెక్కిస్తారు. ఇందుకు పెద్ద హీరోలేమి అతీతం కాదు. ఇప్పుడు #RT4GM విషయంలో కూడా అలాంటి చర్చ జరిగితే తప్పు ఏమిటి? అంత మాత్రాన మాస్ మహారాజా సినిమా ఆగిపోయిందన్న ప్రచారం చేయడం నిజంగా మంచి విషయం కాదు. మొదటి నుంచి ఇలా వరుస అవాస్తవాలతో రవి తేజను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి