iDreamPost

దురదృష్టం అంటే ఈమెదే.. ఎంత ప్రయత్నించినా దేవుడు కనికరించలేదు!

చాలా మంది తమ లక్ష్యం కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు తమ గమ్యాన్ని చేరుకుని ఎంతో సంతోషిస్తుంటారు. మరికొందరికి మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. ఇక తాము అనుకున్నది సాధించామనే లోపే దురదృష్టం వెంటాడుతుంది. అచ్చం అలానే ఓ మహిళకు జరిగింది.

చాలా మంది తమ లక్ష్యం కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు తమ గమ్యాన్ని చేరుకుని ఎంతో సంతోషిస్తుంటారు. మరికొందరికి మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. ఇక తాము అనుకున్నది సాధించామనే లోపే దురదృష్టం వెంటాడుతుంది. అచ్చం అలానే ఓ మహిళకు జరిగింది.

దురదృష్టం అంటే ఈమెదే.. ఎంత ప్రయత్నించినా దేవుడు కనికరించలేదు!

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నో ఆశలు ఉంటాయి. తమ లక్ష్యం కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేరుకునే సమయంలో దురదృష్ణం వెంటాడి.. ఆశలను అడియాశలు చేస్తుంది. ఇది ఉద్యోగం, సినిమాలు, రాజకీయం వంటి అనేక రంగాల్లో జరుగుతుంది. అలానే ఓ  మహిళకు కూడా దురదృష్టం వెంటాడింది. ఇక ఆమెకు వచ్చిన కష్టం పగవారికి కూడా రాకూడదు. తాను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇది అందినట్లే అంది.. చేజారిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఇంతకీ ఆమె స్టోరీ ఏమిటి అనేక కదా మీ సందేహం. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది.  మొత్తంగా ఏడు విడతల్లో ఈ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ కూటమికి మధ్యప్రదేశ్ లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కూటమి తరపున సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఖజురహో లోక్ సభ అభ్యర్థి మీరా యాదవ్‌ ను పోటీ కి నిలబెట్టారు. ఆమెకు ఇక తాను ఈజీగా గెలుస్తాని, ఎంపీ కావచ్చని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇటీవలే ఎన్నికల కమిషన్ కి ఆమె సమర్పించిన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఎన్నికల కమిషన్‌కు అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో ‘సిగ్నేచర్ మిస్సింగ్’  అనే పాయింట్ మీద పోటీ నుండి నిష్క్రమించడానికి దారితీసింది.

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నివారి అసెంబ్లీ స్థానం నుంచి 2008లో సమాజ్‌వాదీ పార్టీ తరపున మీరా యాదవ్ ఒకసారి గెలిచారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఓటమిని పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైన గెలవాలని ఆమె భావించారు. అందుకే నివారి నుంచి ఖజురహో లోక్‌సభ స్థానం మారారు. ఖజురహా పార్లమెంట్ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ మీరా యాదవ్‌ టికెట్ ఇచ్చింది. తొలుత వేరే వ్యక్తికి టికెట్ కేటాయించి.. ఆతరువాత మీరా యాదవ్ కి ఇచ్చారు. దీంతో చివరి రోజైన గురువారం ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు.

శుక్రవారం నామినేషన్లు పరిశీలన అనంతరం ఆమె నామినేషన్ తిరష్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఈ అంశంపై తాము కోర్టుకు వెళ్తామని మీరా యాదవ్ తెలిపారు. మీరా యాదవ్‌ నామినేషన్‌ను తిరస్కరించడం “ప్రజాస్వామ్య హత్య”గా సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. ఇక ఖజురహో స్థానంలో బీజేపీ నుంచి వి.డి. శర్మను పోటీకి చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 4.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మరి.. మీరా యాదవ్ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి