iDreamPost

ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో ప్రకటించిన KCR.. కొత్త స్కీమ్స్‌ ఇవే!

ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో ప్రకటించిన KCR.. కొత్త స్కీమ్స్‌ ఇవే!

తెలంగాణలో ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా సంసిద్దమైంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ నేడు తెలంగాణ భవన్ లో 51 మందికి బీ-ఫారమ్ అందజేశారు. మిగిలిన వారికి రేపు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాబోయే ఐదేళ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్దికి బీఆర్ఎం కొత్తగా ఏం చేయబోతుందో.. కొత్త స్కీముల ద్వారా ప్రజలకు ఎలా లబ్ది కలుగుతుందో మీడియా సమావేశంలో వివరించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలే కాదు.. ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తుందని గర్వంగా చెబుతున్నామని అన్నారు.

తెలంగాణ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణగా అభివృద్ది చేశాం. ఇప్పుడు దేశంలో మనం అమలు పరుస్తున్న స్కీమ్స్ ని అందరూ ప్రశంసిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినవి మాత్రమే కాదు.. చెప్పనివి కూడా అమలు చేశాం. కళ్యాణ లక్ష్మి, విదేశీ విద్య ఎక్కవ ప్రకటించకున్నా ప్రజల కోసం అమలు చేశాం. దాదాపు 99.9 శాంతం ఎన్నికల ప్రణాళికలు అమలు చేస్తూ వచ్చాం. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, రాద్దాంతాలు చేసినా ప్రజా సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు చేశాం. రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం, ప్రజలకు లక్ష కేసీఆర్ బీమా పథకం, నెల పింఛన్లు ఐదు వేలకు పెంపు, దళిత బంధు, ముస్లింలకు బడ్జెట్ పెంపు చేస్తున్నట్లు బడ్డెట్ లో ప్రకటించాం.

బీఆర్ఎస్ మేనిఫెస్టో లోని ముఖ్యాంశాలు:
– రూ.5 లక్షలతో బీమా సౌకర్యం… ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు
-ఆసరా పెన్షన్లు రూ.3 వేలకు పెంపు
– తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం… ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్నబియ్యం
-సాధారణ మరణానికి కూడా కేసీఆర్ బీమా వర్తింపు
– సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
– తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం…93 లక్షల కుటుంబాలకు లబ్ది
– అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
– జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
– దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు
– పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్
– అనాథ బాలల కోసం పటిష్టమైన అర్బన్ పాలసీ
– అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత
– హైదరాబాదులో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
– ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు
– పింఛన్లు ఏడాదికి రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంపు
– రైతు బంధు మొత్తం దశలవారీగా రూ.16 వేల వరకు పెంపు… ముందుగా రూ.12 వేలకు పెంపు
– ఆసరా పింఛన్ల మొత్తం దశలవారీగా పెంపు
-కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.
-మహిళా స్వశక్తి గ్రూప్‌లకు సొంత భవన నిర్మాణం
– ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ ఏర్పాటు
-గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.
-తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి