iDreamPost

వీడియో: ఖాకీ కావరం.. మహిళకు మత్తు మందు ఇచ్చి 40 గంటల పాటు..!

వీడియో: ఖాకీ కావరం.. మహిళకు మత్తు మందు ఇచ్చి 40 గంటల పాటు..!

పోలీసులు అంటే ఓ ధైర్యం, ఓ భరోసా. జరుగుతున్న అన్యాయాలకు అడ్డుగా నిలిచి రక్షణ కల్పించింది పోయి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే బ్రిటన్ లో కొందరు పోలీసులు ఎవరూ ఊహించని పాడు పనికి తెర లేపి పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చని తెచ్చారు. ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి దాదాపు 40 గంటల పాటు అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు పోలీసుల చేసిన ఆ దారుణం ఏంటి? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

బాధితురాలి కథనం ప్రకారం.. బ్రిటన్ కు చెందిన 38 ఏళ్ల మహిళ తనకు రెండేళ్ల కిందట జరిగిన దారుణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో పాటు దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేయడం విశేషం. అసలు విషయం ఏంటంటే? బ్రిటన్ లోని గ్రేట్ మాంచెస్టర్ పోలీస్ స్టేషన్ లో కొందరు పోలీసులు ఆ మహిళకు మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత స్టేషన్ లోనే ఓ సెల్ బంధించి దాదాపు 40 గంటల పాటు ఆమెను నగ్నంగా అలాగే ఉంచి హింసకు గురి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదంతా ఆ సెల్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే, గత రెండేళ్ల కిందట జరిగిన ఈ దారుణాన్ని బాధితురాలు ఓ ఇంటర్వ్యూలో వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: అతడితో పరిచయమే ఆమె పాలిట శాపమయ్యిందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి