iDreamPost

సెప్టెంబర్ బోణీ – కొత్తవి వద్దు పాతవి ముద్దు

అయిదో తేదీన వచ్చిన సీతారామం, బింబిసారలు గొప్ప విజయాలు అందుకోగా వారం తర్వాత విడుదలైన కార్తికేయ 2 ఏకంగా ఆల్ ఇండియా లెవెల్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది.

అయిదో తేదీన వచ్చిన సీతారామం, బింబిసారలు గొప్ప విజయాలు అందుకోగా వారం తర్వాత విడుదలైన కార్తికేయ 2 ఏకంగా ఆల్ ఇండియా లెవెల్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది.

సెప్టెంబర్ బోణీ – కొత్తవి వద్దు పాతవి ముద్దు

గత నెల ఆగస్ట్ మొదటి రెండు వారాలు అద్భుతంగా సాగాయి. అయిదో తేదీన వచ్చిన సీతారామం, బింబిసారలు గొప్ప విజయాలు అందుకోగా వారం తర్వాత విడుదలైన కార్తికేయ 2 ఏకంగా ఆల్ ఇండియా లెవెల్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. మాచర్ల నియోజకవర్గం, లైగర్ లాంటి చేదు అనుభవాలు బాక్సాఫీసు కు లేకపోలేదు కానీ సక్సెస్ రేట్ పరంగా చూసుకుంటే టాలీవుడ్ ఉన్నంత కళగా ఇంకే వుడ్డు లేదన్నది వాస్తవం. అదే ఆశలు అంచనాలతో సెప్టెంబర్ నెల మీద ట్రేడ్ ఎంతో నమ్మకం పెట్టుకుంది. కానీ చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చినా కూడా ఫస్ట్ వీక్ బోణీ డిజాస్టర్స్ తో మొదలుకావడం మూవీ లవర్స్ ని నిరాశపరిచింది.

ఉప్పెన సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ మూడో సినిమా రంగ రంగ వైభవంగా కొండపొలం కంటే పెద్ద ఫ్లాప్ దిశగా పరుగులు పెడుతోంది. రీజనబుల్ రేట్లకే థియేట్రికల్ బిజినెస్ చేసినప్పటికీ కనీసం ఆరు నుంచి ఎనిమిది కోట్ల దాకా నష్టం తప్పకపోవచ్చని అంటున్నారు. ఎప్పుడో వాడి పారేసిన లవ్ అండ్ ఫ్యామిలీ ఫార్ములాని మరోసారి ప్రేక్షకుల మీదకు రుద్దాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇక విక్రమ్ రకరకాల విచిత్ర వేషాలు వేసిన కోబ్రా ఎత్తులు పారలేదు. రెండో రోజే ఇరవై నిమిషాలకు పైగా కోత వేసినా ఆడియన్స్ కనికరించలేదు సరికదా దాని వల్ల కలిగిన ప్రయోజనం అంతంతమాత్రమే. ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో హడావిడి ఎక్కువ మ్యాటర్ తక్కువ స్థాయిలో తోక ముడిచేసింది.

అనూహ్యంగా సీతారామం, కార్తికేయ 2లకు నిన్న వీకెండ్ చాలా చోట్ల మంచి కలెక్షన్లు పడ్డాయి. ఏ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ నమోదయ్యాయి. నెల రోజుల తర్వాత కూడా ఈ దూకుడు కనిపించడం చిన్న విషయం కాదు. కొత్తగా వచ్చినవి కనీసం యావరేజ్ స్థాయిలోనూ లేకపోవడంతో జనం వీటికే ఓటు వేస్తున్నారు. ఇక ఇప్పుడు అందరి చూపు శర్వానంద్ ఒకే ఒక జీవితం మీదున్నాయి. దీనికన్నా ఎక్కువగా జనం దృష్టి బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ పైనుంది. ఇవి కనక అంచనాలకు తగట్టు ఉంటే మళ్ళీ థియేటర్లు కళకళలాడటం చూడొచ్చు. దసరా దాకా ప్రతివారం సందడి చేసే సినిమాలు గట్టిగానే వస్తున్నాయి. కంటెంట్ ఉన్నవే గెలుస్తాయని వేరే చెప్పాలా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి