iDreamPost

జాంటీ రోడ్స్, కైఫ్ ఇతని ముందు దిగదుడుపే! ఆల్ టైమ్ వరల్డ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్

  • Author Soma Sekhar Published - 04:36 PM, Sat - 17 June 23
  • Author Soma Sekhar Published - 04:36 PM, Sat - 17 June 23
జాంటీ రోడ్స్, కైఫ్ ఇతని ముందు దిగదుడుపే! ఆల్ టైమ్ వరల్డ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్

‘క్యాచ్ విన్స్ మ్యాచ్’ అన్న సామెత క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. ఒక్క క్యాచ్ ను జారవిడిస్తే.. మ్యాచ్ లు కూడా చేజారిపోయిన సంఘటనలు మనం అనేకం చూశాం. ఇప్పటికే మనం అనేక బెస్ట్ క్యాచ్ లను చాలా చూసే ఉన్నాం. కానీ తాజాగా టీ20 బ్లాస్ట్ క్రికెట్ లో నమోదు అయిన క్యాచ్  వరల్డ్ బెస్ట్ క్యాచ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రస్తుతం ఈ అద్భుతమైన క్యాచ్ వీడియో క్రికెట్ ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. జాంటీ రోడ్స్, ఏబీడీ, జడేజా, కైఫ్ లను తలదన్నేలా ససెక్స్ ఆటగాడు ఈ క్యాచ్ ను ఒంటి చేత్తో ఒడిసిపట్టాడు. టీ20 బ్లాస్ట్ లీగ్ లో భాగంగా.. హంప్ షైర్ వర్సెస్ ససెక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుతం చోటుచేసుకుంది.

ఒకప్పుడు అద్భుతమైన క్యాచ్ లకు పెట్టింది పేరు జాంటీ రోడ్స్. ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యువరాజ్, జడేజా లు మళ్లీ అలాంటి ఫీల్డింగ్ తో ఓ వెలుగు వెలిగారు. తాజాగా జరిగిన టీ20 బ్లాస్ట్ లీగ్ లో ఓ వండర్ ఫుల్ క్యాచ్ నమోదు అయ్యింది. ఈ లీగ్ లో భాగంగా.. హంప్ షైర్ వర్సెస్ ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్ షైర్ జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది.

ఈ క్రమంలోనే హంప్ షైర్ జట్టు విజయానికి 11 బంతుల్లో 23 రన్స్ అవసరం కాగా.. క్రీజ్ లో అప్పటికే ఆడుతున్న బెన్ని హావెల్ ఉన్నాడు. అతడు 14 బంతుల్లోనే 25 పరుగులు చేసి మంచి ఊపు మీదున్నాడు. ఈ క్రమంలోనే 19వ ఓవర్ వేయడానికి వచ్చాడు మిల్స్. ఈ ఓవర్ లో రెండో బంతిని హావెల్ భారీ షాట్ కొట్టాడు. ఇక బాల్ గమనం చూస్తే.. అది కచ్చితంగా స్టాండ్స్ లో పడుతుందని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యాంగా బ్రాడ్ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ.. ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. బ్రాడ్ కర్రీ అద్భుత విన్యాసంతో.. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటుగా మైదానంలోని ఆటగాళ్లు సైతం సంభ్రమాశ్చర్యాలకు గురైయ్యారు. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. బ్రాడ్ కర్రీ అద్భుతమైన క్యాచ్ తోనే కాకుండా.. బౌలింగ్ లోనూ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లను నేలకూల్చాడు.  మరి ఆ స్టన్నింగ్ క్యాచ్ వీడియోను మీరూ చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి