iDreamPost

CM Jagan: డా. BR అంబేడ్కర్ జయంతి.. నివాళులు అర్పించిన CM జగన్‌

  • Published Apr 14, 2024 | 6:11 PMUpdated Apr 14, 2024 | 6:11 PM

అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆ వివరాలు..

అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆ వివరాలు..

  • Published Apr 14, 2024 | 6:11 PMUpdated Apr 14, 2024 | 6:11 PM
CM Jagan: డా. BR అంబేడ్కర్ జయంతి.. నివాళులు అర్పించిన CM జగన్‌

నేడు అనగా ఏప్రిల్ 14, ఆదివారం నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్ జయంతి. బడుగు, బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం, చదువు అందిచిన నాడే.. సమాజంలో అసమనాతలు తొలుగుతాయని నమ్మిన వ్యక్తి అంబేడ్కర్. అందుకు తగ్గట్టుగానే రాజ్యాంగంలో వారికి ఎన్నో హక్కులు, అధికారాలు కల్పించాడు. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేడ్కర్ ఆశయ సాధనకు పాటు పడుతున్నారు. బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో పెద్ద పీట వేస్తూ.. అంబేడ్కర్ కలలు కన్న నవ సమాజ స్థాపనకు కృషి చేస్తున్నారు.

ఇక నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. సీఎం జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమ‌నే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శ‌నికుడు డాక్టర్ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.

‘’సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమ‌నే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శ‌నికుడు డాక్టర్ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ పేరిట భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికీ తలమానికం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ సీఎం వైఎస్‌ జగన్ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు.

ఇక జగన్ పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో ఆయన మీద గుర్తు తెలియని ఆగంతకులు రాళ్ల దాడి చేశారు. ఇది హత్యాయత్నమే అంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు స్పందించడమే కాక.. జరిగిన దాడిని ఖండించారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం.. ఈ దాడిపై సీరియస్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి