iDreamPost

బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్.. డైరెక్టర్ తో రాత్రి గడిపితే సీరియల్ ఆఫర్ అంటూ..!

Bollywood Serial Actress On Casting Couch: సిల్వర్ స్క్రీన్ అయినా.. స్మాల్ స్క్రీన్ అయినా సక్సెస్ రావాలంటే కష్టపడాల్సిందే. అలాగే కాస్టింగ్ కౌచ్, మీటూలు అక్కడ కూడా ఉంటాయంట. అదే విషయాన్ని ఒక బాలీవుడ్ బుల్లితెర నటి చెప్పుకొచ్చింది.

Bollywood Serial Actress On Casting Couch: సిల్వర్ స్క్రీన్ అయినా.. స్మాల్ స్క్రీన్ అయినా సక్సెస్ రావాలంటే కష్టపడాల్సిందే. అలాగే కాస్టింగ్ కౌచ్, మీటూలు అక్కడ కూడా ఉంటాయంట. అదే విషయాన్ని ఒక బాలీవుడ్ బుల్లితెర నటి చెప్పుకొచ్చింది.

బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్.. డైరెక్టర్ తో రాత్రి గడిపితే సీరియల్ ఆఫర్ అంటూ..!

సాధారణంగా సిల్వర్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా ఊరికే సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు అయిపోరు. కెరీర్ లో పైకి రావడానికి చాలానే కష్టాలు పడి ఉంటారు. సక్సెస్ కోసం వెయిట్ చేయడం చేసుంటారు. టాలెంట్ కి తగిన ఒక గొప్ప అవకాశం వచ్చే దాకా లైఫ్ లో స్ట్రగుల్స్ తో సావాసం చేస్తూనే ఉంటారు. అయితే ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తమ లైఫ్ లో ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లను చూసి గొప్పగా ఫీలవుతూ ఉంటారు. అయితే ఆ జ్ఞాపకాల్లో కొన్ని అనుకోని సంఘటనలు, కష్టాలు కూడా ఉంటాయి. ఈ బుల్లితెర నటి కూడా తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇబ్బందులను ఒకసారి నెమరు వేసుకుంది. అలాగే క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది.

హిందీ ప్రేక్షకులకు, హిందీ సీరియల్స్ చూసే వారికి బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అయితే దివ్యాంకకు కూడా ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. లైఫ్ లో చాలానే కష్టాలు పడింది. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. “నా లైఫ్ లో నేను చాలానే కష్టాలు పడ్డాను. నా కెరీర్ మొదట్లో నేను టూత్ పేస్ట్ పెట్టెలను సేకరించేదాన్ని. వాటిని దాచుకుని చెత్త ఏరుకునే వారికి అమ్మే దాన్ని. ఒక్కో పెట్టెకు ఒక రూపాయి ఇచ్చేవాళ్లు. బతకడానికి ఏదో ఒకటి చేయాలి. నేను సర్వైవ్ అయ్యేందుకు అలా చేశాను. ఆ డబ్బుతో నా పెంపుడు కుక్కకు ఫుడ్, నా బిల్స్ కట్టుకునే దాన్ని. ఆ రోజుల్లో నాకు నెలకు రూ.2 వేలు వచ్చినా సరిపోయేవి” అంటూ చెప్పుకొచ్చింది.

TV actress shocking comments

ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి కూడా దివ్యాంక త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేసింది. “ఒక సీరియల్ గానీ, షో గానీ పూర్తయ్యాకే యాక్టర్స్ కి అసలు కష్టాలు ప్రారంభమవుతాయి. సరైన అవకాశాలు, డబ్బులు లేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కట్టాల్సిన బిల్లులు, ఈఎంఐలు మీద పడతాయి. అలాంటి కష్టమే నాకు కూడా వచ్చింది. ఆ సమయంలో ఒక మంచి అవకాశం వచ్చిందని ఆశగా వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లాక డైరెక్టర్ తో ఒక రాత్రి గడిపితేనే ఆ సీరియల్ ఆఫర్ వస్తుందని చెప్పారు. నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. నేను అక్కడి నుంచి వెళ్లిపోయాను.

అలాంటి వాళ్లు మీకు తారసపడుతూనే ఉంటారు. ఇండస్ట్రీలో అలాంటివి చాలా కామన్ అని మిమ్మల్ని నమ్మించాలని చూస్తారు. వాళ్లు చెప్పినట్లు చేయకపోతే మీ కెరీర్ నాశనం చేస్తామంటూ బెదిరిస్తారు. కానీ, మీరు భయపడకండి. అలాంటి వాళ్లు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ టాలెంట్ ని నమ్ముకుని ఉండండి. మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఇలాంటి కాస్టింగ్ కౌచ్, మీటూల గురించి ఆలోచించడం కంటే.. అసలు అలాంటివి జరగలేదు అని పట్టించుకోకుండా ఉంటడమే మంచిది” అంటూ దివ్యాంక త్రిపాఠి స్పష్టం చేసింది. మరి.. బుల్లితెర నటి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి