iDreamPost

వీడియో: బిర్యానీ రగడ, కస్టమర్లపై సిబ్బంది దాడి.. సీన్ లోకి రాజాసింగ్ ఎంట్రీ!

Raja Singh On Abids Hotel Issue: ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని చూస్తుంటారు. కానీ కొన్ని సమయంలో వేడుకల సందర్భంగా అపశృతులు జరుగుతుంటాయి.

Raja Singh On Abids Hotel Issue: ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని చూస్తుంటారు. కానీ కొన్ని సమయంలో వేడుకల సందర్భంగా అపశృతులు జరుగుతుంటాయి.

వీడియో: బిర్యానీ రగడ, కస్టమర్లపై సిబ్బంది దాడి.. సీన్ లోకి రాజాసింగ్ ఎంట్రీ!

తెలుగు రాష్ట్రాలో కొత్త సంవత్సరం వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చిన్న పెద్దా అనే వయసు తేడా లేకుండా పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ హుషారుగా సెలబ్రెషన్స్ చేసుకున్నారు. హూటల్స్, పబ్, క్లబ్లులు, రిసార్ట్స్ లో జనాలు కిక్కిరిసిపోయారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. హ్యాపీగా కొత్త సంవత్సరం వేడుకలను ఎంజాయ్ చేయాలనుకున్న కొంతమంది కస్టమర్లపై హూటల్ సిబ్బంది కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ లో చేర్పంచి చికిత్స అందించారు. వివరాల్లోకి వెళితే..

హైదారబాద్ అబిడ్స్ లో ఉన్న ఓ హోటల్ లో మటన్ బిర్యానీ విషయంలో గొడవ మొదలైంది.. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. కస్టమర్లను హూటల్ సిబ్బంది కర్రలతో అతి దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు కస్టమర్లు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్ హూటల్ సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి దూల్ పేటకు చెందిన కొంతమంది అబిడ్స్ లోని ఓ హూటల్ కి వచ్చారు. మటన్ బిర్యాని ఆర్డర్ చేశారు. బిర్యానీలో మటన్ సరిగా ఉడకలేదని కస్టమర్లు హూటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లకు చిర్రెత్తుకొచ్చింది. తాము బిర్యాని తినలేదు.. డబ్బులు చెల్లించం అని వెయిటర్లతో అనడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది.

ఈ క్రమంలోనే హూటల్ సిబ్బంది కర్రలతో వచ్చి కస్టమర్లపై విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారు. ఈ దాడిలో గొడవ పెట్టుకున్న కస్టమర్లతో పాటు దాదాపు 30 మంది కస్టమర్లకు గాయాలు అయ్యాయి. గొడవ గురించి తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడ్డ వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హూటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ రోజు కస్టమర్లు ఎంతో సంతోషంగా ఉండాలని చూస్తే.. వారిని దారుణంగా కట్టెలతో కొట్టడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు గ్రాండ్ హూటల్ వెయిటర్లు, యాజమాన్యంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. లేదంటే హూటల్ కి నిప్పు పెడతామని హెచ్చరించారు. తాజాగా ఈ గొడవకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి