iDreamPost

రాజకీయాలకు దూరంగా ఉంటా.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజు రోజుకీ రాజకీయాల్లో హీట్ పెరిగిపోతుంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ కండువ కప్పుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజు రోజుకీ రాజకీయాల్లో హీట్ పెరిగిపోతుంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ కండువ కప్పుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

రాజకీయాలకు దూరంగా ఉంటా.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో రాజకీయాలో రోజు రోజుకీ రసవత్తరంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసి, బి-ఫారాలు ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో కూడా సిట్టింగులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థుల విషయంలో చర్చల మీద చర్చలు చేస్తూ ఆలస్యంగా జాబితా విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ మొదటి జాబితాలో 55 మంది, రెండవ జాబితాలో 45 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది. బీజేపీ మొదటి లిస్టు లో 52 , రెండు లిస్టు లో ఒక్కరి పేరు మాత్రమే ఖారారు చేస్తూ లిస్టు రిలీజ్ చేసింది. ఇక మొదటి నుంచి పార్టీలను నమ్ముకొని తీరా లిస్టు లో పేర్లు రాకపోవడంతో అసంతృప్తుల సెగ పెరిగిపోతుంది. అంతేకాదు ప్రత్యర్థి పార్టీ కండువా కప్పుకొని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు, రాజకీయ నాయకుడు బాబు మోహన్ తన రాజకీయ భవిష్యత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు బాబు మోహన్. ఓ వైపు నటన కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1998లో ఆందోల్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరుపున నుంచి పోటీ చేసి గెలిచారు. 1999లో సాధారణ ఎన్నికలో మరోసారి గెలిచారు. కార్మిక శాఖా మంత్రిగా వ్యవహరించారు. 2004, 2009లో కాంగ్రెస్ నేత దామోదర్ రాజనర్సింహ చేతిలో ఓడివపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన మొదటి లిస్టు లో బాబు మోహన్ పేరు రాలేదు. అంతేకాదు ఈసారి ఆందోల్ నుంచి ఆయన తనయుడు ఉదయ్ బాబుమోహన్ పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తండ్రి-కొడుకుల మధ్య పోటీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

బీజేపీ మొదటి లీస్టు లో 52 ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేయగా.. రెండో లిస్టులో కేవలం ఒక్కరి పేరు మాత్రమే ఫైనల్ చేసింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన నటుడు, రాజకీయ నేత బాబు మోహన్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈసారి నేను పోటీ చేయను, ప్రచారం కూడా చేయను. బీజేపికి ఐదేళ్లుగా పనిచేస్తున్నా, నిన్నటికి నిన్న నియోజకవర్గంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి పార్టీని గెలిపించాలని చెప్పా.. అలాంటింది నా విషయంలో అధిష్టానం ఇంత నిర్లక్ష్యం వహించడం ఎంత వరకు న్యాయం, మొదటి లిస్టులో నా పేరు వస్తుందని భావించాను.. కానీ రాలేదు, పైగా టికెట్ విషయంలో నా కొడుకు ఉదయ్ పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో తీవ్ర కలత చెందాను. నాకు ఉన్నది ఒక్కడే కొడుకు.. మా ఇద్దరి మధ్య చిచ్చు పెడుతున్నారు.. ఇది చాలా అన్యాయం. నేను ఫోన్లు చేస్తే ఎవరు స్పందించరు.. పార్టీలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరు ఉంటారు? బీజేపీ పెద్దలతో మాట్లాడి వాళ్ల వైఖరిని ఆధారంగా చేసుకొని బీజేపీలో ఉండాల.. పోవాలా? అనేది నిర్ణయించుకుంటా’ అని అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి