iDreamPost

OTTలోకి వచ్చేసిన బిజు మీనన్ పోలీస్ డ్రామా.. తెలుగులో కూడా..

Biju Menon Police Drama: బిజు మీనన్- షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన పోలీస్ డ్రామా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే..

Biju Menon Police Drama: బిజు మీనన్- షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించిన పోలీస్ డ్రామా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే..

OTTలోకి వచ్చేసిన బిజు మీనన్ పోలీస్ డ్రామా.. తెలుగులో కూడా..

ఈ మధ్య ఓటీటీ సినిమాల జాతర ఎక్కువైపోయింది. వారానికి కనీసం పది నుంచి 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సూపర్ హిట్ సినిమాలు వస్తుంటే.. కొన్ని మాత్రం మంచి యాక్షన్ డ్రామా చిత్రాలు వస్తున్నాయి. వచ్చిన అన్ని సినిమాలు చూడలేం. కానీ, వాటిలో కొన్ని మాత్రం మిస్ చేసుకోలేం. అలాంటి వాటిలో బిజు మీనన్- షైన్ టామ్ చాకో నటించిన సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఆ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 15 అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ సినిమా ఏది? ఎలా ఉంది? అసలు ఆ సినిమా కథ ఏంటో చూద్దాం.

బిజు మీనన్ కు మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. రణం, ఖతర్నాక్ వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఆ తర్వాత అతను నటించిన అయ్యనుమ్ కొషియ్యుమ్ అనే సినిమాని తెలుగులో పవన్ కల్యాణ్- రానా భీమ్లానాయక్ గా రీ మేక్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బిజు మీనన్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ వచ్చారు. ముఖ్యంగా బిజు మీనన్ ఎంచుకునే కథలు కాస్త కొత్తగా, యాక్టింగ్ స్కోప్ ఎక్కవగా ఉంటుంది. అలాంటి పాత్రే ఈ సినిమాలో కూడా చేశాడు. ఈ సినిమా పేరు తుండు. అంటే తెలుగులో ఒళ్లు తుడుచుతునే తుండు అనుకోకండ. మలయాళంలో తుండు అంటే పరీక్షల్లో చూసి రాయడనికి స్లిప్పులు పెడతారు కదా అది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో మార్చి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. సరిగ్గా నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. కానిస్టేబుల్ గా ఉండే బిజు మీనన్ ప్రమోషన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అతనికి ఏదీ వర్కౌట్ కాదు. ఎంత ప్రయత్నించినా ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోతూ ఉంటాడు. పైగా రియల్ లైఫ్ లో కూడా అతనికి ఏవో తెలియని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నాడో కూడా అర్థం కాదు. మరోవైపు తన కుమారుడు కూడా పరీక్షల్లో పాస్ అయ్యేందుకు నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఒకరోజు స్లిప్పులు పెట్టుకుని వెళ్తే దొరికిపోతాడు. ప్రిన్సిపల్ పిలిచి తండ్రికి కూడా క్లాస్ పీకుతుంది. అప్పుడు కొడుకుని బిజు మీనన్ గట్టిగా మందలిస్తాడు.

చివరికి ఒక సీనియర్ కానిస్టేబుల్ ఇచ్చిన సలహా పట్టుకుని ప్రమోషన్ కోసం బిజు మీనన్ కూడా కాపీ కొట్టేందుకు డిసైడ్ అయిపోతాడు. కథ మొత్చం చెప్తున్నామని తిట్టేసుకోకండి. ఇప్పటివరకు చెప్పింది ట్రైలర్ మాత్రమే. ఈ సినిమా లో షైన్ టామ్ చాకో కూడా కీలక పాత్రలో నటించాడు. అసలు బిజు మీనన్ కు షైన్ టామ్ చాకోకి ఉన్న సంబంధం ఏంటి? అసలు బిజు మీనన్ పరీక్షల్లో పాస్ అవుతాడా? అతని కొడుకు కూడా ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాడా? చివరికి బిజు మీనన్ ప్రమోషన్ సాధించాడా లేదా? అనేదే కథ. ఈ సినిమా సీరియస్ నోట్ లో కామెడీని పంచుతూ ఉంటుంది. మరి.. తుండు సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి