iDreamPost

ప్రెగ్నెంట్‌ చేస్తే చాలు.. ఏకంగా లక్షలు.. షాకింగ్‌ దందా!

మొన్నటి వరకు అద్దె గర్బాల పేరిట భారీ ఎత్తున దందా నడిచింది. చాలా మంది ఆడవాళ్లు ఇందుకు బలయ్యారు. ఇప్పుడు మగవారిని టార్గెట్‌ చేసుకుని ఓ దందా మొదలైంది.

మొన్నటి వరకు అద్దె గర్బాల పేరిట భారీ ఎత్తున దందా నడిచింది. చాలా మంది ఆడవాళ్లు ఇందుకు బలయ్యారు. ఇప్పుడు మగవారిని టార్గెట్‌ చేసుకుని ఓ దందా మొదలైంది.

ప్రెగ్నెంట్‌ చేస్తే చాలు.. ఏకంగా లక్షలు.. షాకింగ్‌ దందా!

కాదేదీ కవితకు అనర్హం అన్నాడు అలనాటి శ్రీశ్రీ.. కానీ, ఇప్పుడు కొంతమంది నేరగాళ్లు కాదేదీ మోసాలు చేయడానికి అనర్హం అని అంటున్నారు. కొత్త కొత్త దారులు వెతుక్కుని మరీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కొంతమంది నేరగాళ్లు ప్రెగ్నెంట్‌ జాబ్‌ సర్వీసు పేరిట దందా మొదలెట్టారు. మహిళల్ని గర్భవతుల్ని చేస్తే లక్షలు ఇస్తామంటూ నమ్మబలికారు. పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బిహార్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

బిహార్‌లో ఓ ముఠా ‘ ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ సర్వీస్‌’ పేరిట ఓ దందా మొదలెట్టింది. మహిళల్ని గర్భవతుల్ని చేస్తే లక్షలు ఇస్తామంటూ నమ్మబలికింది. వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం మొదలుపెట్టింది. ఆసక్తి గల వ్యక్తులు 799 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రేషన్‌ తర్వాత ప్రాసెస్‌ ఏంటంటే.. రిజిస్ట్రేషన్‌ తర్వాత కొంతమంది మహిళ ఫొటోల్ని పంపుతారు. వారు సెలెక్ట్‌ చేసుకున్న మహిళను బట్టి 5 వేలనుంచి 20 వేల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్‌ చేయించుకుంటారు.

ఆ తర్వాత వారు ఎంపిక చేసుకున్న మహిళను ప్రెగ్నెంట్‌ చేయగలిగితే.. 13 లక్షల వరకు ముట్టజెబుతారు. అలా కాకపోయినా.. కనీసం 5 లక్షల రూపాయలు అయినా ఇస్తారు. ఇక, ఈ దందాపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిహార్‌లోని నవాడాకు చెందిన ఓ సుమారు 8 మంది వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ గ్యాంగ్‌కు లీడర్‌ అయిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని మిగిలిన విషయాలను సేకరిస్తామని కూడా తెలిపారు.

 ఈ గ్యాంగ్‌ కారణంగా కొంతమంది మోసపోయినట్లు కూడా తెలుస్తోంది. కాగా, మొన్నటి వరకు అద్దె గర్భాల దందా నడిచింది. పేద మహిళల్ని టార్గెట్‌ చేసుకుని ఆ దందా నడిచింది. ఎంతో మంది నిరుపేద మహిళలు, అమ్మాయి అద్దె గర్భం ఊబిలో కూరుకుపోయి అల్లాడారు. కొంతమంది తమ జీవితాలను సైతం నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా మగవారిని టార్గెట్‌ చేస్తూ దందా పుట్టుకు వచ్చింది. ఈ దందాలో మోసం తప్ప వాస్తవం లేదని తెలుస్తోంది.

ఐవీఎఫ్‌ పద్దతులు అందుబాటులో ఉన్న ఈ కాలంలో వీటిని నమ్మటం మూర్ఖత్వం అని సైబర్‌ క్రైమ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త పద్దుతుల్లో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మరి,  ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ సర్వీస్‌’ పేరిట సాగిన ఈ దందాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి