iDreamPost

బిగ్ బాస్ 7 ప్రోమో రిలీజ్.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు!

బిగ్ బాస్ 7 ప్రోమో రిలీజ్.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా ఎదురచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సీజన్ ఎంత త్వరగా స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ అంతా తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన లోగో లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రోమో ఎప్పుడు వస్తుందా అని తెగ ఎదురుచూశారు. ఆ ప్రోమో కూడా రానే వచ్చేసింది. తాజాగా స్టార్ మా బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ప్రోమో రిలీజ్ చేసింది. మరి.. ఆ ప్రోమో ఎలా ఉందో చూద్దాం.

ఈ సీజన్ లో హోస్ట్ మారతారంటూ చాలామంది తెగ ఊహాగానాలు చేశారు. కానీ, అవన్నీ పక్కను నెడుతూ కింగ్ నాగార్జునానే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవసహిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నారు అని లీక్ అయింది. దానిని నిజం చేస్తూ అక్కినేని నాగార్జున ప్రోమోతో వచ్చేశారు. అయితే ఇది పెద్ద ప్రోమో కాదులెండి. ప్రోమోకి చిన్న కర్టన్ రైజర్ గా తీసుకొచ్చారు. కానీ, ఎప్పటిలాగానే నాగార్జున లుక్స్ మాత్రం ఇరిగదీశాడు. ప్రోమో స్టార్ట్ లో ఈసారి సీజన్.. అని ఆపేసి ఏం చెప్పాలో కాసేపు ఆలోచించుకున్నారు.

కానీ, ఎప్పుడూ రొటీన్ డైలాగ్స్ అవుతున్నాయంటూ ఆగిపోతాడు. అయితే కొత్తగా కుడి ఎడమైతే అంటూ డైలాగ్ చెప్తాడు. ఇంక ఏముంది వెనకాల సెట్ మొత్తం గాల్లోకి లేచి అటువి ఇటు.. ఇటువి అటు మారుతూ ఉంటాయి. ఈసారి సీజన్ మాములుగా ఉండదు అన్నట్లు నాగ్ ఒక స్మైల్ ఇవ్వగానే ప్రోమో అయిపోతుంది. ఇక్కడ ఈ సీజన్ గురించి చాలా పెద్ద హింట్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఈసారి సీజన్ కోసం బిగ్ బాస్ చాలా పెద్ద ప్లానే వేసినట్లు ఉన్నాడు.

కుడి ఎడమ అయ్యేది హౌస్ సెటప్పా? లేక ఇంటి సభ్యుల విషయంలో ఏమైనా బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకుంటున్నారా? ఇంకా ఏమైనా ట్విస్టులు ప్లాన్ చేశారా? అనే విషయంపై క్లారిటీ మాత్రం రాలేదు. గట్టిగానే ప్లాన్ చేశారని చెప్పారు. త్వరలోనే సీజన్ స్టార్ట్ కాబోతోంది అంటూ తెలియజేశారు. ప్రోమో ఇంత త్వరగా రిలీజ్ చేశారంటే.. సీజన్ ని ఈసారి ఆగస్టులోనే ప్రారంభిస్తారేమో చూడాలి. ఎందుకంటే సాధారణంగా సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేస్తారు. అంటే ఆగస్టులో ప్రోమోలు రిలీజ్ చేసుకోవచ్చు. కానీ, ఈసారి కాస్త ఫాస్ట్ గానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7ని ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి