iDreamPost

ఆడియన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ బాస్ మరో 2 వారాలు పొడిగింపు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట ఆసక్తిగా సాగుతోంది. 11వ వారం నో ఎలిమినేషన్ వీక్ అంటూ ప్రకటించారు. దాంతో 12వ వారానికి హౌస్ లో మొత్తం 10 మంది సభ్యులు మిగిలారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట ఆసక్తిగా సాగుతోంది. 11వ వారం నో ఎలిమినేషన్ వీక్ అంటూ ప్రకటించారు. దాంతో 12వ వారానికి హౌస్ లో మొత్తం 10 మంది సభ్యులు మిగిలారు.

ఆడియన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ బాస్ మరో 2 వారాలు పొడిగింపు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. గత సీజన్స్ తో పోలిస్తే ఆసక్తిగా సాగుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన సీజన్ 7.. ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. హౌస్ లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే ఫినాలే వీక్ కు చేరుకుంటారు. అలా అనుకుంటే హౌస్ లో ఉన్న మిగిలిన వాళ్ల సంగతి ఏంటి? అనే ప్రశ్న వస్తుంది. కానీ, వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మాత్రం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. బిగ్ బాస్ సీజన్ 7ని ఇంకో ఒకటి, రెండు వారాలు పొడిగించబోతున్నారు అంటూ చెబుతున్నారు. అసలు అలా జరుగుతుందా? ఒకవేళ జరగాల్సి వస్తే ఎందుకు అలా జరుగుతుంది? అనే విషయాలు పరిశీలిద్దాం.

సాధారణంగా బిగ్ బాస్ సీజన్ ని 15 వారాలు కొనసాగిస్తున్నారు. వాటిలో 14 వారాల్లో.. వారానికి ఒకరు చొప్పున హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తూ ఆటను ముందుకు నడిపిస్తారు. ఒక్కోసారి ఎలిమినేట్ అయిన సభ్యుడిని కూడా హౌస్ లోకి తీసుకొస్తారు. ఎలా చూసినా కూడా 15వ వారానికి మాత్రం కేవలం ఐదుగురు మాత్రమే ఫైనలిస్టులు అవుతారు. ఈ సీజన్లో అయితే 14 మంది కంటెస్టెంట్స్, ఐదుగురిని వైల్డ్ కార్డుగా తీసుకొచ్చారు. వారిలో ఎలిమినేట్ అయిన రతికను మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చారు. అంటే ఈ సీజన్లో మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఉన్నట్లు లెక్క వస్తుంది. 11వ వారంలో ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు. అందుకే 12వ వారానికి కూడా హౌస్ లో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 12వ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తామని చెబుతున్నారు. అలా చూసినా కూడా ఫినాలే వీక్ కి ఆరుగురు సభ్యులు అవుతారు.

ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా కాబట్టి టాప్ 5కి బదులు టాప్ 6 చేస్తారేమో అని అనుకున్నారు. ఈ విషయంపై బిగ్ బాస్ యాజమాన్యం కూడా బాగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆరుగురు ఫైనలిస్టులను చేద్దామా? ఒకటి రెండు వారాలు సీజన్ పొడిగిద్దామా? అంటూ గట్టిగానే చర్చించారంట. ఇందుకు సంబంధించి లీకులు బాగానే వచ్చాయి. అయితే చివరికి టాప్ 6 వద్దు.. బిగ్ బాస్ సీజన్ పొడిగిద్దామనే నిర్ణయానికే వచ్చారంట. అంటే ఈ సీజన్ ఎలా చూసుకున్నా కనీసం ఒక వారం పొడిగించాల్సి వస్తుంది. ఒకవేళ వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ లేకపోతే మాత్రం సీజన్ ని రెండు వారాలు పొడిగించాల్సి వస్తుంది.

ఈ విషయంపై హోస్ట్ నాగార్జున కూడా కామెంట్స్ చేయడం చూశాం. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఈ వీక్ ఎలిమినేషన్ లేదని చెప్పారు. వెంటనే వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అక్కడితో ఆగితే ఎలాంటి అనుమానాలు వచ్చేవి కావు. కానీ, గుర్తుపెట్టుకోండి ఇది ఉల్టా పుల్టా సీజన్.. ఇక్కడ ఎప్పుడు ఏమైనా జరగచ్చు అంటూ హింట్స్ ఇచ్చారు. ఆ మాటలను పట్టుకునే ఇప్పుడు సీజన్ పొడిగింపు జరుగుతుందనే విషయాన్ని బలంగా చెబుతున్నారు. అదే జరిగితే ఈ సీజన్ లో ఇది కూడా ఒక ఆసక్తికర అంశంగా మారబోతోంది. మరి.. బిగ్ బాస్ సీజన్ ని పొడిగిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి