iDreamPost

Bigg Boss 7 కొత్త ప్రోమో.. ఇది అంతం కాదు- ఆరంభం!

Bigg Boss 7 కొత్త ప్రోమో.. ఇది అంతం కాదు- ఆరంభం!

బుల్లితెరలో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఎంతో ఆదరణ ఉంది. స్టార్ట్ అయిన ప్రతి భాషలో ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇంక తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు సైతం ఎదురుచూస్తూ ఉంటారు. లైమ్ లైట్ లో లేని చాలా మందికి బిగ్ బాస్ తో మళ్లీ లైఫ్ దొరికినట్లు అయింది. వీజే సన్నీ, సోహైల్ లాంటి వాళ్లు టాలీవుడ్ లో హీరోలుగా సినిమాలు కూడా చేశారు. ఇంకా చాలా మంది తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 7కి చేరుకుంది.

తెలుగులో బిగ్ బాస్ ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ సీజన్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి చాలా అప్ డేట్స్ ఇచ్చారు. తాజాగా మరో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సీజన్ లో అంతా తలకిందులు కాబోతోంది అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త ప్రోమోలో కూడా అదే విషయాన్ని మళ్లీ చెప్పారు. ఒక ప్రేమ జంట కొండ అంచుల మీద ప్రాణాలు కాపాడుకునేందుకు తిప్పలు పడుతూ ఉంటుంది. హీరో వేలాడుతూ ఉండగా.. హీరోయిన్ తన దుపట్టా ఇచ్చి అతడిని పైకి లాగేందుకు చూస్తుంది.

అతను దుపట్టా పట్టుకోగానే కథ సుఖాంతం అవుతుంది. కానీ, నాగార్జున ఎంట్రీ ఇచ్చి కథ మొత్తాన్ని మార్చేస్తాడు. హీరోయిన్ కి తుమ్ము రావడంతో దుపట్టా పదిలేస్తుంది హీరో వెళ్లి లోయలో పడతాడు. అలాగే ఇప్పటి వరకు ఉన్న బిగ్ బాస్ సీజన్స్ ఒకెత్తు.. ఇప్పుడు రాబోతున్న సీజన్ 7 మరో ఎత్తు అంటూ చెబుతున్నారు. మొదటి నుంచి చెబుతున్నట్లుగానే కుడి ఎడమ అవుతుందని.. అంతా తలకిందులు అవుతుందంటూ సీజన్ పై మరింత క్రేజ్ పెంచేస్తున్నారు. పైగా ఈ సీజన్ కి సంబంధించి 24 గంటల స్ట్రీమింగ్ కూడా ఉండదని చెప్పారు. గతంలో మాదిరిగానే రోజు మొత్తం జరిగిన దాన్ని ఒక గంట ఎపిసోడ్ గా ప్రసారం చేస్తారని చెబుతున్నారు.

అదే జరిగితే బిగ్ బాస్ కు మరింత క్రేజ్ వస్తుందనే చెప్పాలి. ఈ సీజన్ లో ఉండే టాస్కులు, ఆడించే గేమ్స్, ఎలిమినేషన్, నామినేషన్ ప్రక్రియ అంతా మారిపోతుందని చెబుతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా ఉంటే.. అందరూ పాత సీజన్స్ చూసి బాగా ప్రిపేర్ అయి వస్తున్నారని స్వయంగా నాగార్జునానే కామెంట్ చేశాడు. అందుకే ఈసారి సీజన్ మొత్తాన్ని మార్చేస్తున్నట్లు.. డిఫరెంట్ గేమ్ ప్లేతో వస్తున్నాం అని చెబుతున్నారు. ఈసారి ఇంట్లోకి వెళ్లే వాళ్ల పేర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎప్పటిలాగానే అన్ని విభాగాలు కవర్ అయ్యేలా చూస్తున్నారు. ముఖ్యంగా సీరియల్ హీరోస్, హీరోయిన్స్ కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఎదురుచూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి