iDreamPost

బిగ్ బాస్ సినిమా – సభ్యుల హంగామా

బిగ్ బాస్ సినిమా – సభ్యుల హంగామా

వీకెండ్ ముంగిట బిగ్ బాస్ 4 నిన్న ఇంకో కొత్త హడావిడితో సందడి చేసింది. టాస్కులు వెరైటీగా ఉంటున్నప్పటికీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ప్రేక్షకుల్లో కలుగుతోంది. మొన్న అవినాష్ ను కెప్టెన్ గా చేయడం ఏమంత ఆశించిన ఫలితాలు ఇచ్చేలా కనిపించడం లేదు. తోపుడు బండి అంటూ హంగామా చేశారు కానీ అదేమంత ఆసక్తికరంగా సాగలేదు. ఇక ఈసారి బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ అనే సినిమా టాస్కును ఇచ్చారు. దాని ప్రకారం పార్టిసిపెంట్స్ అందరూ యూనిట్ సభ్యులుగా మారిపోవాలి. వాళ్ళకిచ్చిన పాత్రలకు తగ్గట్టు జీవించాలి. అభిజిత్ దర్శకుడిగా, దివి అతనికి అసిస్టెంట్ గా, అవినాష్ స్క్రిప్ట్ రైటర్ గా, నోయెల్ కెమెరామెన్ గా, అమ్మ రాజశేఖర్ డాన్స్ మాస్టర్ గా, లాస్య స్టైలిస్ట్ గా, హారిక సోహైల్ లు ఐటెం సాంగ్ డాన్సర్స్ గా ఎంపిక చేయబడ్డారు.

ఇక గేమ్ విషయానికి వస్తే వీళ్లంతా కలిసి తీయబోయే సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉండాలి. ఎవరు ఏం చేయాలనేది స్క్రిప్ట్ రైటర్ తో కలిసి డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. షూటింగ్ చేసేందుకు కావాల్సిన వనరులు, ఎక్విప్మెంట్ అన్నీ అక్కడే గార్డెన్ ఏరియాలో సెట్ చేసి ఉంచారు. టాస్కు మొదలు కాగానే ఎవరి పనిని వాళ్ళు మొదలుపెట్టారు. ఐటెం సాంగ్ ఎక్కడ ఎలా షూట్ చేయాలనే విషయంలో అమ్మ రాజశేఖర్ , అభిజిత్ ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. లొకేషన్ తానే ఎంపిక చేసుకుంటానన్న అమ్మ మాటకు అభిజిత్ నో చెప్పాడు. అది బిగ్ బాస్ ఇష్టమని ముందే చెప్పారని దివి కూడా తనకు సపోర్ట్ చేసింది.

ఈ డ్రామా ఇంకాసేపు అలాగే కొనసాగింది. పాట చిత్రీకరణ చేసేటప్పుడు అక్కడ కొరియోగ్రాఫర్ తప్ప డైరెక్టర్ ఉండాల్సిన అవసరం లేదని అమ్మ రాజశేఖర్ చెప్పినప్పుడు అభిజిత్ అవసరానికి మించి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఆపై సినిమా ఎలా తీయాలన్న దాని మీద సభ్యుల మధ్య హాట్ డిస్కషన్లు, చికాకులు, అలకలు యథావిధిగా జరిగిపోయాయి. గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ కు హారిక, సోహైల్ మధ్య రిహార్సల్ జరిగింది. ఇక ఈ రోజు వీకెండ్ కాబట్టి నాగార్జున బదులు సమంతా వచ్చి యాంకరింగ్ బాధ్యత తీసుకోబోతోందని ఇప్పటికే గట్టి లీక్ వచ్చింది. బ్లాక్ బస్టర్ టాస్కును తన సమక్షంలోనే చేయబోతున్నారట

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి