iDreamPost

కన్నీటి వరదతో తడిసిన బిగ్ బాస్

కన్నీటి వరదతో తడిసిన బిగ్ బాస్

నిన్న బిగ్ బాస్ హౌస్ ని పార్టిసిపెంట్స్ కన్నీళ్లతో తడిపేశారు. తమ చిన్ననాటి ఫోటోలు చూపగానే ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళిపోయి చాలా ఎమోషనల్ గా తమ కథలను వినిపించారు. కొందరిలో నిజాయితీ కనిపించగా మిగిలినవాళ్లు మాత్రం అవసరానికి మించిన డ్రామా పండించారు. వేట సినిమాలో చిరంజీవి సంవత్సరాల తరబడి కుటుంబానికి దూరంగా ఒంటరిగా అండమాన్ జైలులో ఉంటాడు. తర్వాత బయటికి తప్పించుకుని వస్తాడు. అచ్చం అదే తరహాలో ఇక్కడి సభ్యులు కూడా తామేదో అష్టకష్టాలు పడుతూ ఫ్యామిలీని వదిలి రావాల్సి వచ్చిందనే తరహాలో శోకాలు పెట్టడం సోషల్ మీడియాలోనూ కామెంట్స్ కి దారి తీసింది.

బాల్యంలోని జ్ఞాపకాలు చూసుకుంటే ఎవరికైనా మధురానుభూతి కలగడం సహజం. కానీ ఇక్కడ వెరైటీగా అదేదో పోగొట్టుకున్నది దొరికిన తరహాలో చేయడం మాత్రం కొంత డ్రమటిక్ గా అనిపించింది. అరియానా తన అసలు పేరు అర్చన అని చెబుతూ లైఫ్ లో పడిన కష్టాలు, తండ్రి చెల్లి పుట్టే సమయంలో విడిపోయినా తల్లి ఎలా తమను పెంచి పెద్ద చేసిందో వివరించింది. ఆ తర్వాత లాస్య, మోనాల్, సోహైల్. మెహబూబ్, హారికలు తమ మెమోరీస్ ని షేర్ చేసుకున్నారు. ఓ ఇద్దరివి టచింగ్ గా ఉండగా మరికొందరివి మాత్రం అక్కడ ఏడ్చేంత ఏముందనిపించింది మాత్రం నిజం. మొత్తానికి డీల్స్ పేరుతో రెండు రోజుల నుంచి జరుగుతున్న అతిని కవర్ చేసేందుకు అన్నట్టుగా కాసేపు సెంటిమెంట్ సినిమా చూపించారు.

ఇక ఫన్నీ విషయాలను చూస్తే పిలిచి మరీ సోహైల్ తనకు నూడుల్స్ తినిపించడాన్ని అరియనా ఓవరాక్షన్ చేయడానికి వాడుకుంది. అవినాష్ కూడా నేనేం తక్కువ తిన్నానా అనే రేంజ్ లో వయ్యారాలు పోయాడు. ఇదంతా శృతి మించిన మాట వాస్తవం. హారిక, నోయల్, అభిజిత్ లు కాసేపు గ్రూపు రాజకీయాలు చేసుకున్నారు. లగ్జరీ బడ్జెట్ లో వచ్చిన నాన్ వెజ్ ఐటమ్స్ కి హౌస్ మేట్స్ మాములుగా మురిసిపోలేదు. రియల్ మ్యాంగో బాటిల్స్ తాగే విషయంలో మెహబూబ్ ఏకంగా ఏడు లాగించి విన్నర్ గా నిలిచాడు. ఇలా అన్ని కలగలిసి బిగ్ బాస్ ఆల్ ఇన్ వన్ మసాలాగా తయారయాయ్యింది. ఇక రేపు ఎలిమినేషన్ ఎపిసోడ్ రాబోతోంది కాబట్టి ఇవాళ్టి తతంగం కీలకంగా మారబోతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి