iDreamPost

భార్యకు విడాకులు ఇచ్చిన బిగ్​బాస్ కంటెస్టెంట్.. ఆమె జ్ఞాపకాలను మర్చిపోతానంటూ..!

  • Author singhj Updated - 07:59 PM, Sat - 19 August 23
  • Author singhj Updated - 07:59 PM, Sat - 19 August 23
భార్యకు విడాకులు ఇచ్చిన బిగ్​బాస్ కంటెస్టెంట్.. ఆమె జ్ఞాపకాలను మర్చిపోతానంటూ..!

ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. నూరేళ్లు కాపురం చేయాల్సిన దంపతులు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నారు. మనస్పర్థలు, ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోవడం.. ఇలా కారణం ఏదైనా డివోర్స్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. విడాకులు తీసుకునే సెలబ్రిటీల సంఖ్య అంతకంతకీ ఎక్కువవుతోంది. తాజాగా మరో సెలబ్రిటీ తన భార్యకు విడాకులు ఇచ్చారు. కన్నడ బిగ్​బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన కిరిక్ కీర్తి తన వివాహ బంధానికి ముగింపు పలికారు. భార్య అర్పితతో తాను విడాకులు తీసుకున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

భార్యతో గడిపిన క్షణాలు, పాత జ్ఞాపకాలను మర్చిపోయి త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టనున్నట్లు కిరిక్ కీర్తి తెలిపారు. మ్యారేజ్ అయిన 11 ఏళ్లకు ఈ జంట డివోర్స్ తీసుకోవడం గమనార్హం. కాగా, వీళ్లిద్దరికీ ఇప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. గతంలో ఈ స్టార్ కపుల్ విడాకులు తీసుకోనున్నట్లు రూమర్స్ వినిపించాయి. వాటిని నిజం చేస్తూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు డివోర్స్ తీసుకున్నారు. ఈ రోజు తామిద్దరమూ చట్ట ప్రకారం విడిపోయామని కిరిక్ కీర్తి తన ఇన్​స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు.

‘మేమిద్దరం ఈ రోజు చట్టప్రకారం విడిపోయాం. అర్పితతో నా వివాహ బంధానికి పూర్తిగా తెరపడింది. ఇకపై నా వ్యక్తిగత విషయాలతో ఆమెకు సంబంధం ఉండదు. మేం అఫీషియల్​గా డివోర్స్ తీసుకున్నాం. ఆమె కూడా మంచి లైఫ్​ను పొందాలని ఆశిస్తున్నా. చేదు జ్ఞాపకాలను మర్చిపోవాలని అనుకుంటున్నా. అలాగే మీ ప్రేమ, ఆశీస్సులు భవిష్యత్తులోనూ నా మీద ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని కిరిక్ కీర్తి పోస్ట్ చేశారు. కాగా, తాను డిప్రెషన్​తో బాధపడుతున్నట్లు కొన్ని నెలల కింద ఆయన వెల్లడించారు. తన కొడుకు ఫ్యూచర్ గురించి ఆందోళన చెందుతున్నానని.. జీవితం ప్రశ్నార్థకంగా మారిందని కిరిక్ కీర్తి చెప్పుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by ಕಿರಿಕ್ ಕೀರ್ತಿ – Kirik Keerthi (@kirikkeerthi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి