iDreamPost

బిగ్‌బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్! నటి వివరణ

బిగ్ బాస్ ఫేం నటి హిమజ అరెస్టు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై నటి హిమజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

బిగ్ బాస్ ఫేం నటి హిమజ అరెస్టు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై నటి హిమజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

బిగ్‌బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్! నటి వివరణ

హైదరాబాద్ శివారులో పోలీసులు ఓ ఫాం హౌజ్ పై దాడి చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారన్న వార్త వైరల్ గా మారింది. ఈ రేవ్ పార్టీలో బిగ్ బాస్ ఫేం నటి హిమజ అరెస్టు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై నటి హిమజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు. అసత్య ప్రచారాలకు తెరలేపుతున్న మీడియా ఛానల్స్, న్యూస్ యాప్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోలీస్ స్టేషన్ లో లేను ఇంట్లోనే ఉన్నాను. సంతోషంగా దీపావళి వేడుకలను జరుపుకుంటున్నానని వివరణ ఇచ్చారు.

తను అరెస్టు అయినట్లు వస్తున్న వార్తలపై హిమజ స్పందించారు. తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా లైవ్ లో వివరణ ఇచ్చారు. ఆ వీడియోలో తను మాట్లాడుతూ.. నేను రేవ్ పార్టీలో అరెస్టు అయ్యానంటూ ప్రచారం చేస్తున్నరన్న విషయాన్ని ఫ్రెండ్స్, కుటుబ సభ్యుల ద్వారా తెలుసుకున్నాను. అది ఫేక్ అని చెప్పడానికే ఇలా వీడియోతో లైవ్ లో మీ ముందుకు వచ్చానని తెలిపింది. నేను ఇంట్లోనే ఉన్నాను. అరెస్ట్ అయ్యాను పోలీస్ స్టేషన్ లో ఉన్ననంటూ ప్రచారం చేస్తున్నాయి మీడియా ఛానల్స్. ఎవరో ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి తనిఖీలు చేసి వెళ్లి పోయారు. అంతే తప్ర నన్ను అరెస్టు చేయలేదు,అదుపు లోకి తీసుకోలేదు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. చాలా సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుండగా ఇలా అసత్య ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం.

ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మొద్దు. నేను నా ఇంట్లో ఫ్రెండ్స్ , కుటుంబ సభ్యులతో సంతోషంగా వేడుక జరుపుకుంటున్నాము అని హిమజ తెలిపింది. కొన్ని న్యూస్ యాప్స్, ఓ మీడియా ఛానల్ హిమజ అరెస్టు అయ్యిందంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మేము చాలా బాగా ఉన్నాము. ఇంట్లోనే ఉన్నాము. పోలీస్ స్టేషన్ లో లేము. ప్రూఫ్ కోసమే ఈ వీడియో చేస్తున్నాము. ఫేక్ న్యూస్ కంటే ముందు అసలు ఏం జరిగిందో తెలియజేయడానికే ఇలా మీ ముందుకు వచ్చాను. ఎవరో ఇచ్చిన ఇన్ఫర్ మేషన్ తో పోలీసులు వచ్చి తనిఖీలు చేశారు. ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసా. అన్ వాంటెడ్ గా ఫేక్ న్యూస్ ప్రమోట్ చేసే యాప్స్ ఎందుకు చేస్తాయో మీకు తెలుసు. వాటి గురించి మాట్లాడుకోవడం వృథా. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని హిమజ వెల్లడించింది. సేఫ్ గా దీపావళి జరుపుకోవాలని కోరుతూ.. అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోను ముగించింది హిమజ.

 

View this post on Instagram

 

A post shared by Himaja💫 (@itshimaja)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి