iDreamPost

బిగ్ బాస్ కంటెస్టెంట్ కి షాకిచ్చిన నెటిజన్స్.. లక్షన్నర కాజేశారు!

బిగ్ బాస్ కంటెస్టెంట్ కు లైఫ్ లో మర్చిపోలేని ఒక చేదు అనుభవం ఎదురైంది. అతను చేసిన ఒక వీడియో వల్ల ఏకంగా రూ.లక్షన్నర పోగొట్టుకున్నాడు. ఎవరు చేశారు.. ఎలా చేశారో కూడా తెలియకుండానే.. తన వద్దనున్న లక్షన్నర సొమ్మును పోగొట్టుకున్నాడు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ కు లైఫ్ లో మర్చిపోలేని ఒక చేదు అనుభవం ఎదురైంది. అతను చేసిన ఒక వీడియో వల్ల ఏకంగా రూ.లక్షన్నర పోగొట్టుకున్నాడు. ఎవరు చేశారు.. ఎలా చేశారో కూడా తెలియకుండానే.. తన వద్దనున్న లక్షన్నర సొమ్మును పోగొట్టుకున్నాడు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ కి షాకిచ్చిన నెటిజన్స్.. లక్షన్నర కాజేశారు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిగ్ బాస్ హవా నడుస్తోంది. ఏ భాషలో అయినా బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ షో ద్వారా సెలబ్రిటీలు అయినవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి ఒక సెలబ్రిటీకి పాపం ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. తాను చేసిన ఒక వీడియో వల్ల అతనికి ఏకంగా రూ.లక్షన్నర లాస్ వచ్చింది. అది కూడా ఐఫోన్ కొనుగోలు చేసుకోవాలి అని దాచుకున్న డబ్బును కాజేశారంటూ వాపోయాడు. ఇలాంటి పరిస్థితిలో అతనికి చాలా భయంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

అభిషేక్ మల్హాన్.. ఈ ప్రముఖ యూట్యూబర్ కు హిందీ బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత యూట్యూబర్ గా కొనసాగుతున్నాడు. అతను ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. తాను తనతోపాటుగా ఎప్పుడూ లేని విధంగా రూ.లక్షన్నర వరకు డబ్బును తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. వాటితో ఐఫోన్ కొనుగోలు చేయబోతున్నాను అన్నాడు. ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఇంకేముంది గుర్తుతెలియని వ్యక్తులు అతని వద్దనున్న రూ.లక్షన్నరను ఎంచక్కా కొట్టేశారు. అసలు అవి ఎలా పోయాయో కూడా అతనికి తెలియలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అభిషేక్ మల్హాన్ స్పందించాడు.

“నా జీవితంలోనే నేను అంత పెద్ద మెత్తంలో డబ్బును ఎప్పుడూ తీసుకెళ్లలేదు. ఇలాంటి సమయంలో నా హృదయం బాధతో ద్రవించిపోతోంది. నేను నా డబ్బు పోయిన విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. నేను ఆ నగదుతో ఐఫోన్ కొనాలి అనుకున్నాను. మా నాన్నతో చాలాసార్లు చెప్పారు. డబ్బుతో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఇది తల్చుకుంటేనే చాలా భయంగా ఉంది. నా లైఫ్ లో ఇలాంటి ఒక ఘటన జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడంలేదు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాను” అంటూ అభిషేక్ మల్హాన్ చెప్పుకొచ్చాడు. అభిషేక్ మల్హాన్ కి ఎదురైన ఈ ఘటన ఎంతో మందికి వేకప్ కాల్ అవుతుందనే చెప్పాలి.

ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో అప్ డేట్స్ పేరుతో ప్రతి విషయాన్ని షేర్ చేస్తున్నారు. తాము ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని రోజులు వెళ్తున్నారు? మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తారు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ అడ్రస్ ఏంటి? ఇలా ప్రతి వ్యక్తిగత అంశాన్ని వ్లాగ్స్, వీడియోలు, రీల్స్ పేరుతో నెట్టింట పెట్టేస్తున్నారు. గతంతో పోలిస్తే సోషల్ మీడియా వచ్చాక దొంగల పని చాలా సులభం అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే మీరు పెట్టే ఫొటోలు, మీరు వేసుకునే దుస్తులను బట్టి మీ స్టేటస్ ని లెక్క వేస్తారు. ఆ తర్వాత మీ ఇంటిపై ఓ కన్నేస్తారు. ఇంకేముంది.. మీరు ఎప్పుడైతే గోయింగ్ టు లాంగ్ వెకేషన్ అంటారో.. అప్పుడు ఏకంగా మీ ఇంట్లో కన్నం వేస్తారు. కాబట్టి చాలా మంది ఆర్థిక, టెక్ నిపుణులు, పోలీసులు చెప్తున్నట్లుగా ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల రూపంలో షేర్ చేసుకోకుండా ఉంటేనే మీ వ్యక్తిగత భద్రతకు మేలు చేస్తుంది. మరి.. ఒక్క వీడియోతో రూ.లక్షన్నర పోగొట్టుకున్న ప్రముఖ యూట్యూబర్ అభిషేక్ మల్హాన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి