iDreamPost

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అతను విన్నర్ అయ్యాక ఆ ఆనందం కొన్ని గంటలు కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం రిమాండు ఖైదీగా ఉన్నాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అతను విన్నర్ అయ్యాక ఆ ఆనందం కొన్ని గంటలు కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం రిమాండు ఖైదీగా ఉన్నాడు.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడి!

పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ అల్లర్ల కేసులో అరెస్టు అయ్యి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు గజ్వేల్ మండలం కొల్గూరులో పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేశారు. ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మహావీర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడుల ఘటనలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ కేసులో పల్లవి ప్రశాంత్ ఏ-1గా ఉన్నాడు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండు విధించింది. పల్లవి ప్రశాంత్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు.

పల్లవి ప్రశాంత్ బయట ఉంటే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందనే అనుమానంతో ప్రశాంత్ ను రిమాండుకు ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. నాంపల్లి న్యాయస్థానం ప్రశాంత్ కు 14 రోజుల రిమాండు విధించింది. ప్రశాంత్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతని రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పల్లవి ప్రశాంత్ కు 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చిన తర్వాతే అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రశాంత్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పల్లవి ప్రశాంత్ వల్లే యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ ముందే ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారంటూ పోలీసులు వెల్లడించారు.

సాక్షాధారాలు తారుమారు చేసేందుకు అవకాశం ఉందనే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎన్నిసార్లు చెప్పిన ప్రశాంత్ వినలేదన్నారు. భవిష్యత్ లో సమాజం పట్ల బాధ్యత, భయం ఉండాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశామన్నారు. రెండు కార్లను అద్దెకు తీసుకు పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు వచ్చారన్నారు. ప్రశాంత్ ఉసిగొల్పడం వల్లే అక్కడున్న వాళ్లు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహావీర్ కు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కు బెయిల్ వస్తుందా? అతని కేసు మరింత బలపడుతుందా? అనే అనుమానాలు వినిపిస్తున్నారు.

సెలబ్రిటీలు కూడా పల్లవి ప్రశాంత్ కు మద్దతు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ చేసిన పనికి ఎందుకు ప్రశాంత్ ను అరెస్టు చేశారంటూ అశ్వినీ శ్రీ ప్రశ్నించింది. అలాగే ప్రశాంత్ అమాయకుడు.. అతనికి ఏమీ తెలియదు అంటూ భోలే షావలి వ్యాఖ్యానించాడు. సోహైల్ కూడా ప్రశాంత్ కు మద్దతుగా నిలిచాడు. ఇంక మాజీ బిగ్ బాస్ సభ్యుడు, రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా పల్లవి ప్రశాంత్ అరెస్టు విషయంపై స్పందించాడు. ప్రశాంత్ తప్పు చేశాడా? చేయలేదా? అనే విషయాన్ని న్యాయస్థానానికి వదిలేయాలంటూ సూచించాడు. సోషల్ మీడియాలో అతనిపై ట్రోలింగ్ ఆపాలంటూ సూచించాడు. అతని కుటుంబాన్ని చూస్తుంటే బాధేస్తోంది అంటూ ఆదిరెడ్డు చెప్పుకొచ్చాడు. మరి.. పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేయడం, 14 రోజులు రిమాండ్ విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి