iDreamPost

Bigg Boss 7 Telugu: అమర్​దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి! ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..!

  • Published Dec 18, 2023 | 8:59 AMUpdated Dec 18, 2023 | 8:59 AM

బిగ్​బాస్ రన్నరప్​గా నిలిచిన సీరియల్ యాక్టర్ అమర్​దీప్ కారుపై అటాక్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ దాడి ఎలా జరిగింది? అమర్​ కారును అడ్డగించింది ఎవరు? తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బిగ్​బాస్ రన్నరప్​గా నిలిచిన సీరియల్ యాక్టర్ అమర్​దీప్ కారుపై అటాక్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ దాడి ఎలా జరిగింది? అమర్​ కారును అడ్డగించింది ఎవరు? తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 18, 2023 | 8:59 AMUpdated Dec 18, 2023 | 8:59 AM
Bigg Boss 7 Telugu: అమర్​దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి! ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..!

ఏ రంగమైనా సరే గెలుపోటములు అనేవి సహజం. అది సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్.. ఏదైనా కానివ్వండి. నెగ్గడం, ఓడటం అనేది చాలా కామన్. అయితే గెలిచామా, ఓడామా అనే దాని కంటే ఎంత బాగా ఫైట్ చేశామనేదే ఇంపార్టెంట్. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే దాన్ని మించింది లేదు. అయితే కొందరు మాత్రం గెలుపోటములను ఒకే విధంగా తీసుకోలేరు. నెగ్గిన వారిని ప్రశంసించి, ఓడిన వారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది. కానీ కొందరు మాత్రం దీన్ని ఒకేలా తీసుకోరు. తాము అభిమానించే వారిని ఏమైనా అన్నా సహించలేరు. ఇది అస్సలు మంచిది కాదు. ఇదిలా ఉంటే.. గత కొన్ని వారాలుగా ఫుల్​ ఎంటర్​టైన్ చేస్తున్న బిగ్​బాస్ సీజన్ 7లో విన్నర్ ఎవరనేది చాలా ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈసారి టైటిల్​ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. అతడికి తీవ్ర పోటీ ఇచ్చిన సీరియన్ నటుడు అమర్​దీప్ రన్నరప్​గా నిలిచాడు.

రన్నరప్ అమర్​దీప్ కారుపై కొందరు దాడికి దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్​బాస్​ షో షూటింగ్​ జరిగిన అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తుండగా అమర్​దీప్ కారుపై కొందరు వ్యక్తులు అటాక్ చేశారు. కారులో నుంచి బయటకు రావాల్సిందిగా నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారు. ఆ కారు వెనుక భాగంలోని అద్దాన్ని ధ్వంసం చేశారు. అసభ్య పదజాలంతో తిడుతూ దారుణంగా ప్రవర్తించారు. ఆ వాహనాన్ని ముందూ వెనుకా వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అమర్​దీప్ భార్య, తల్లి, ఫ్రెండ్ నరేష్ లొల్ల తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. దాదాపు అరగంట పాటు వాళ్లు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్నారు. నిరసనకారుల్లో కొందరు అమర్​దీప్​ కారు పైకి ఎక్కి కర్రలతో అటాక్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమర్​దీప్ కారుపై అటాక్​ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. దాడికి దిగిన వారిని చెదరగొట్టారు. భద్రత మధ్య అక్కడి నుంచి వారిని తరలించారు. అయితే ఈ అటాక్​ చేసింది విన్నర్‌‌ పల్లవి ప్రశాంత్ అభిమానులేనని చెబుతున్నారు. కావాలనే టార్గెట్ చేసి మరీ అమర్​ కారు మీద దాడికి దిగారని అంటున్నారు. అతడి ఫ్యామిలీ కారులో ఉందని తెలిసినా.. ఇలా రాళ్లతో కొట్టి, అసభ్య పదజాలంతో తిట్టడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవ్వరైనా సరే ఆటను ఆటగానే చూడాలని.. ఇలా బిహేవ్ చేయడం సరికాదని సీరియస్ అవుతున్నారు. మరి.. బిగ్​బాస్​ రన్నరప్​ అమర్​దీప్ కారుపై జరిగిన దాడి మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Bigg Boss 7 telugu winner రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచింది ఎంతంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి