iDreamPost

Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ గ్రేట్ అని ఒప్పేసుకున్న సెలబ్రిటీలు!

Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ గ్రేట్ అని ఒప్పేసుకున్న సెలబ్రిటీలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ పేరు మారుమోగిపోతోంది. మొదటివారంలో లవ్ ట్రాక్ వల్ల అతని పేరు బాగా వినిపించగా.. ఇప్పుడు అతనిపై సింపథీతో పల్లవి ప్రశాంత్ ఎక్కువ వైరల్ అవుతున్నాడు. నిజానికి ఇంత పాజిటివ్ టాక్ వస్తుందని ప్రశాంత్ కూడా ఊహించి ఉండడు. అతను వేసుకున్న గేమ్ ప్లాన్స్ వర్కౌట్ అయితే వచ్చే పాపులారిటీ కంటే.. సెలబ్రిటీలు చేసిన పనికే ఎక్కువ సింపథీ వచ్చింది. ఇప్పుడు రైతుబిడ్డ బయట బ్రాండ్ అయిపోయింది. అయితే ఆర్టిస్టులు ఇలా ఎందుకు చేశారు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది? అందుకు సమాధానం ఒకటే చెప్పచ్చు. వాళ్లు ప్రశాంత్ కి భయపడ్డారు.

పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఒక కామన్ మ్యాన్ గా వచ్చాడు. కానీ, అతనికి బయట మంచి ఫాలోయింగ్ ఉంది. అతను చేసే వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు సెలబ్రిటీలను కంగారు పడేలా చేస్తోంది. అందుకే వాళ్లు కావాలనే పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే హౌస్ లో ఉన్న చాలా మంది సెలబ్రిటీల కంటే కూడా పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆ విషయం హౌస్ లో ఉన్న అందరికీ తెలుసు. అందరూ ముందే ప్రశాంత్ గురించి తెలుసుకునే వచ్చారు అనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు ప్రశాంత్ బయట ఎలా ఉంటాడో తెలియదు అని చెప్పిన వీళ్లు.. అతని పుట్టు పూర్వొత్తరాలు, అతని సోషల్ మీడియా ఫాలోయింగ్, అతను ఇంటర్వ్యూల్లో ఏం మాట్లాడాడు.. ఇలా అన్ని విషయాలను బయట పెడుతున్నారు.

ఇన్ని రోజులు ప్రశాంత్ ఎవరో తెలియదు అంటూ వీళ్లు ఆడిన గేమ్ ఫేకా? పాజిటివ్ టాక్ కోసమే ప్రశాంత్ తో కావాలని క్లోజ్ అయ్యారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రతిక, గౌతమ్ కృష్ణలు పల్లవి ప్రశాంత్ ఫాలోయింగ్ గురించి కామెంట్స్ చేశాడు. ప్రశాంత్ ఒక్క పోస్టు పెడితే లక్ష రూపాయలు ఇస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అంటే అతనికి కేపబిలిటీపై గౌతమ్ కు క్లారిటీ ఉంది. అలాగే రతిక నామినేట్ చేస్తూ.. నువ్వు ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడావ్ అంటూ చెప్పుకొచ్చింది. అంటే రతికా కూడా పల్లవి ప్రశాంత్ గురించి వాకబు చేసే వచ్చింది. అందుకే కావాలనే పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ గా ఉంది అని చెప్పచు. ఇప్పుడు మాత్రం అందరూ ప్రశాంత్ ని టార్గెట్ చేసి నామినేట్ చేసి.. అతని టే బాగాలేదు అని చెబుతున్నారు.

పల్లవి ప్రశాంత్ సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు అంటున్నారు. అతను సింపథీ ప్లే చేస్తున్నారు అనే విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు. అందుకే అతనిపై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ, వీళ్లు ఇలా టార్గెట్ చేయడంతో ప్రశాంత్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ప్రేక్షుకులు అంతా అతనికే సపోర్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు భయపడ్డారు, టార్గెట్ చేశారు అనడానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది. అదేంటంటే.. నామినేషన్స్ తర్వాత అమర్ దీప్ చెప్పిన మాటలు. అమర్ దీప్ మాట్లాడుతూ ప్రశాంత్ కి యూట్యూబ్ లో రెండున్నర లక్షల వరకు సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో నాలుగున్నర లక్షలకు పైగా ఫాలోవవర్స్ ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ప్రశాంత్ ఫాలోయింగ్ గురించి అమర్ దీప్ భయపడ్డాడు. అతను గేమ్ ఆడితే వాళ్లకి ఇబ్బంది అని ఫిక్స్ అయ్యాడు. నిజానికి అమర్ దీప్ చెప్పిన ఫాలోవర్స్ లెక్కలు సెప్టెంబర్ 3కి ముందువి.

ఇప్పుడు లెక్క బాగా మారిపోయింది. అందుకు కారణం కూడా హౌస్ లో ఉన్న సెలబ్రిటీలే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కు యూట్యూబ్ లో 4 లక్షలకుపైగా సబ్ స్క్రైబర్స్.. ఇన్ స్టాగ్రామ్ లో ఆరు లక్షల 43 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వల్లే జరిగింది అని చెప్పచ్చు. ఇప్పుడు బయట ప్రశాంత్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అతడిని కార్నర్ చేస్తున్నారు అంటూ సింపథీ చూపిస్తున్నారు. ఎంగిలి మెతుకులు తిని సింపథీ కొట్టేద్దాం అనుకున్నాడు ప్రశాంత్. కానీ, అది బ్యాక్ ఫైర్ అయి నెగిటివిటీ వచ్చింది. కానీ, ఇప్పుడు సెలబ్రిటీలు ప్రశాంత్ కు భయపడి పోయి కార్నర్ చేయడంతో అతనికి ఎక్కడ లేని సింపథీ వచ్చేసింది. ఈ పరిస్థితులను సరిగ్గా వాడుకుంటే ప్రశాంత్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అవుతాడు. ఇంట్లోని కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి