iDreamPost

పల్లవి ప్రశాంత్ సత్తా.. హౌస్ మొత్తం ఒకవైపు తానొక వైపు!

పల్లవి ప్రశాంత్ సత్తా.. హౌస్ మొత్తం ఒకవైపు తానొక వైపు!

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 హౌస్ లో అంతా ఉల్టా పుల్టాగానే ఉంటోంది. ఎవరూ ఇంకా కన్ఫామ్ కాలేదు.. అంతా కంటెస్టెంట్స్ మాత్రమే అని చెప్పిన మాట.. వీళ్లకి నిద్రపట్టుకుండా చేస్తోంది. ఈ కంగారులో ఉన్న సమయంలో అప్పుడే నామినేషన్స్ కూడా వచ్చాయి. హౌస్ లో ఉన్న 14 మందిలో తొలివారంలోనే 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఈ వారం నామినేషన్స్ లో శోభాశెట్టి, రతికా రౌజ్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, ధామిని ఉన్నారు. అయితే ఈ కంటెస్టెంట్స్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మంచి క్రేజ్ సంపాదింస్తున్నాడు. అంతేకాక ఓటింగ్ లో కూడ దూసుకెళ్తునట్లు తెలుస్తోంది.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. తాజాగా ఏడో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే గత సీజన్లకు భిన్నంగా  బిగ్ బాస్-7 ఉండనున్నట్లు సమచారం. హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. అంతేకాక నామినేషన్స్ ప్రక్రియ కూడా జరిగింది. ఈ నామినేషన్స్ ప్రక్రియలో  14 మంది పాల్గొనగా.. మొత్తం 8 మంది కంటెస్టెంట్స్‌ నామినేట్ అయ్యారు. అయితే  తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారా? అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు అనే ఆలోచన కూడా చేస్తున్నారు.

అయితే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి రైతు బిడ్డగా  బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ మంచి ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో ఓటింగ్‌తో దూకుడు చూపిస్తునట్లు సమాచారం. నామినేట్ అయిన 8 మందికి ఓటింగ్ జరుగుతుంటే.. అందులో పల్లవి ప్రశాంత్‌కి 35 శాతానికి పైగా ఓట్లు పడినట్లు టాక్. మనోడి సింపథీ గేమ్ బాగా వర్కౌట్ అయ్యిందో.. లేకుంటే పీఆర్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందో ఏమో తెలియదు. పల్లవి ప్రశాంత్ మాత్రం ఓటింగ్‌లో దూకుడు చూపిస్తూ టాప్ లో ఉన్నాడు.

ఆ తరువాత స్థానంలో గౌతమ్ కృష్ణ  ఓట్లు పడుతున్నాయని టాక్. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో టీవీ యాక్టర్ శోభా శెట్టి గొడవతో గౌతమ్ కృష్ణ‌పై పాజిటివిటీ పెరిగింది. ఆ తరువాత శోభా శెట్టికి,  తెలంగాణ పోరి రితికా రోజ్, షకిలా, దామిని, ప్రిన్స్ యావర్ వరుసగా ఉన్నారని సమాచారం. అయితే శుక్రవారం వరకూ ఓటింగ్ లైన్స్ ఓపెన్‌లోనే ఉండటంతో.. ఈ రెండు మూడు రోజుల ప్రదర్శనను.. వాళ్లు ప్రవర్తిస్తున్న తీరుని బట్టి ఓటింగ్ శాతంలో మార్పులు రావచ్చని సినీ విశ్లేషకు అభిప్రాయ పడుతున్నారు. మరి.. రైతుబిడ్డగా  హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ మంచి క్రేజ్ తో దూసుకెళ్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: వీడియో: చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన ఆట సందీప్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి