iDreamPost

బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ కి నాంపల్లి కోర్టులో ఊరట!

Pallavi Prasath Got Relief from the Court: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా సాగింది. ఈసారి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చిక్కుల్లో పడ్డాడు.

Pallavi Prasath Got Relief from the Court: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఉత్కంఠంగా, ఆసక్తిగా సాగింది. ఈసారి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చిక్కుల్లో పడ్డాడు.

బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ కి నాంపల్లి కోర్టులో ఊరట!

టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రియాల్టీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తర్వాత ఇతర భాషల్లో మొదలు పెట్టారు. తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడవ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగింది. పద్నాలు మంది బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిమానులు చేసిన రచ్చకు పల్లవి ప్రశాంత్ అతని తమ్ముడిపై కేసు నమోదైంది. తాజాగా పల్లవి ప్రశాంత్ కి ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ – 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఇకపై పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు జూబ్లి హిల్స్ పోలీసుల ఎదుట హాజరు కానవసరం లేదని కోర్టు పేర్కొంది. బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. కోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో ప్రశాంత్ అతడి సోదరుడు మనోమర్ లకు రెండు నెలల పాటు పోలీసులు ఎదుట హాజరు కావాలని షరతులు విధించింది.  రెండు నెలల సమయం ముగియడంతో పల్లవి ప్రశాంత్ కండీషన్ రిలాక్సేషన్ పిటీషన్ దాఖలు చేయగా.. దీనిపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరిని పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

బిగ్ బాస్ సీజన్ – 7 ఫినాలే పూర్తయిన తర్వాత హౌజ్ నుంచి ట్రోఫీతో బయటకు అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చాడు. అప్పటికే అక్కడ చాలా మంది అభిమానులు కిక్కిరిసిపోయారు. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్ మద్దతుదారులు ఊరేగింపుగా తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ పరిస్థితికి కారణం అయ్యారంటూ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏ1 గా పల్లవి ప్రశాంత్, ఏ2 గా అతడి సోదరుడు మనోహర్, ఏ3 గా వినయ్ లను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, మనోహర్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి