iDreamPost

కోపాల మీద నాగ్ క్లాస్ – మసాలా వంటల టాస్క్

కోపాల మీద నాగ్ క్లాస్ – మసాలా వంటల టాస్క్

కీలకమైన ఫినాలేకు దగ్గరపడుతున్న తరుణంలో బిగ్ బాస్ 4 మరో వీకెండ్ వచ్చేసింది. నాగార్జున ఈ వారం ఏం చేయబోతున్నాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మొన్న అఖిల్ కోసం సొహైల్ త్యాగం చేసి మరీ మెడల్ గెలిపించిన సంగతి తెలిసిందే. అయితే అది వచ్చినంత మాత్రాన సేవ్ అయినట్టు కాదని నాగ్ ట్విస్ట్ ఇవ్వడంతో ఎపిసోడ్ ప్రారంభమయ్యింది. అఖిల్ పర్సనల్ గా మోనాల్, అరియనాలను బుట్టలో వేసుకునేందుకు చేసిన గారడీని వీడియో రూపంలో ప్రదర్శించారు. వరస్ట్ పర్ఫార్మర్ గా ఎంపికైన అభిజిత్ కు శిక్ష పూర్తయ్యిందని చెప్పడంతో అతను జైలు నుంచి బయటికి వచ్చాడు. మిగిలిన సభ్యులతో కలిసిపోయే అవకాశం వచ్చింది.

ఇక టాస్కుల సంగతి చూస్తే ఎంటిఆర్ మసాలాలు ఉపయోగించి వంటలు చేసే పనిని అప్పజెప్పారు. అభిజిత్, హారిక, అవినాష్ ఒక టీమ్ గా అఖిల్, అరియనా, మోనాల్ లు మరో బృందంగా ఏర్పడ్డారు. జడ్జ్ గా నిలిచిన సొహైల్ ఇద్దరినీ విన్నర్స్ ప్రకటించాడు. ఇది గతంలో చేసిన టాస్కే కావడంతో పెద్ద ఆసక్తికరంగా అనిపించలేదు. లగ్జరీ టాస్కులో భాగంగా అభిజిత్ కళ్ళకు గంతలు కట్టుకోగా అఖిల్ అతన్ని గైడ్ చేస్తూ వస్తువులు సంపాదించుకున్నాడు. అభిజిత్, అరియనాలు మాట్లాడుకుంటూ ఉండగా తన ప్రస్తావన వచ్చినందుకు అవినాష్ మరోసారి అపరిచితుడి వేషం ఎత్తి అవసరానికి మించి వీరంగం ఆడాడు.

నాగార్జున ఈ విషయంగానే కోపం టాపిక్ మీద హౌస్ మేట్స్ ని గట్టిగానే నిలదీశారు. అవినాష్ కన్ఫెషన్ రూమ్ కు వచ్చి వివరణ ఇచ్చుకున్నాడు. అతను చెప్పిన దానికి నాగ్ కౌంటర్ సమాధానాలు వీడియోలు చూపించారు. తర్వాత వంతు తీసుకున్న మోనాల్ ఎప్పటిలాగే మరోసారి కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ షో చరిత్రలో ఇంతగా ఏడ్చిన పార్టిసిపెంట్ తనొకటే కావొచ్చు. ఇక అఖిల్ మెడల్ గెలిచిన కారణంగా బాహుబలి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఏదో ఫైనల్ జరిగినంత బిల్డప్ ఇచ్చి హంగామా చేశారు. ఇవాళ ఎలిమినేషన్ అయ్యాక రేపటి నుంచి టాస్కులు ఇంకా రసవత్తరంగా మారనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి