iDreamPost

వీడియో: ఘోర ప్రమాదం.. వంతెనపై గుద్దుకున్న 150 వాహనాలు!

సాధారణంగా చలికాలం అనగానే హైవేలపై ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచు ఉండటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా 150కి పైగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

సాధారణంగా చలికాలం అనగానే హైవేలపై ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచు ఉండటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇది మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా 150కి పైగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

వీడియో: ఘోర ప్రమాదం.. వంతెనపై గుద్దుకున్న 150 వాహనాలు!

సాధారణంగా చలికాలం అనగానే రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తెల్లవారుజామున పొగమంచు ఉండటం వల్ల హైవేలపై ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ ప్రమాదం మాత్రం అందరినీ వణికిపోయేలా చేస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. ఎంకంగా 150 వాహనాలు ఢీకొన్నాయి. వంతనెపై వస్తున్న వాహనాలు అన్నీ ఒకదానిని ఒకట్టి గుద్దుకుంటూ మంటలు చెలరేగాయి. కార్లలో ఉన్న ప్రయాణికులు అంతా గాయాలు, రక్తస్రావంతో నిస్సహాయంగా రోడ్డుపై కుర్చున్నారు. ఈ దృశ్యాలు వీక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి.

ఈ ఘోర రోడ్డు ప్రమాదం అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఇంటర్ స్టేట్ 55 రహదారిపై సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 155కు పైగా వాహనాలు వేగంగా ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. న్యూ ఓర్లానా సమీపంలో వానాలు అన్నీ కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదం దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగినట్లు చూసినవాళ్లు చెబుతున్నారు. అంటే అరగంటపాటు వేగంగా వాహనాలు వస్తూ పొగమంచులో ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకుంటూనే ఉన్నాయి. తర్వాత వాహనాల నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో గాయపడిన డ్రైవర్లు అందరూ రోడ్డుపై సహాయం కోసం కేకలు వేస్తు కనిపించారు. పెద్దఎత్తున సహాయ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయం చేశాయి. దాదాపు 11 మైళ్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి సంబంధించి ఏరియల్ దృశ్యాలను లూసియానా పోలీసులు తమ ఫేస్ బుక్ పేజ్ పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు చూసి నెటిజన్స్ చలించి పోతున్నారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి