iDreamPost

కుట్ర నిజం… ఇదిగో వాస్తవం!!

కుట్ర నిజం… ఇదిగో వాస్తవం!!

 ఏదో జరుగుతుంది… ఏదో కుట్ర ఉంది… ప్రభుత్వానికి ప్రచారం రాకుండా అడ్డుకునే కుట్ర… సర్కారును బదనాం చేసే కుట్ర… ఆంధ్ర ప్రదే శ్, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హిందూ ఆలయాలపై దాడులు వెనుక కుట్ర ఉందన్నది అక్షరాలా సత్యం. సరిగ్గా ఈ ఆలయాల దాడులను నిశితంగా పరిశీలిస్తే దీని వెనుక ఉన్న మర్మం కూడా అర్థమవుతుంది. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమాలను ప్రారంభించే ఈ రోజే ఈ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పగానే ఏదో మూల ఏదో ఆలయం మీద దాడి జరగడం రివాజుగా మారింది. దీని వెనుక ఓ పద్ధతి ఓ వ్యూహం స్పష్టంగా అర్థం అవుతున్నాయి.. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ఆలయాల దాడులను ఒకసారి పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది.

జగన్ నవరత్నాలు లో కీలకమైన అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని… దేశంలో ఇప్పటి వరకు ఒకేసారి 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అని తెలియగానే విజయనగరం జిల్లా రామతీర్థంలో రాత్రివేళ రాముడి విగ్రహం ధ్వంసం అయింది. మొత్తం మీడియా ఫోకస్ అంతా జగన్ కార్యక్రమాన్ని వదిలేసి… రామతీర్థం లోనే వాలిపోయింది. దీంతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ప్రచారం ఏమీ రాలేదు.

అంతర్వేది రథం దగ్ధం అయ్యే సమయంలోనూ… జగన్ ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అంగన్వాడీ లకు ఏ రాష్ట్రం ఇవ్వాలని వివరాలను జగన్ అందించారు. ఆ సమయంలో అది అంతర్వేది రథం ఘటనతో మరుగున పడిపోయింది.

గత ఏడాది నవంబర్లో జగన్ మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతో అద్భుతమైన కార్యక్రమం ఇది. ప్రభుత్వ పాఠశాలల్లో రూపాన్ని మార్చి అద్భుతమైన కార్పొరేట్ పాఠశాలలు తరహా తీర్చిదిద్దిన వైనం దేశంలో ఎక్కడా లేదు. సుమారు రెండువేల పాఠశాలలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న రోజే గుంటూరులోని దుర్గాదేవి ఆలయంలో విగ్రహాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం తప్ప తర్వాత ఆ బొడ్డు గురించి ఎక్కడా మీడియాలో ప్రచారం రాలేదు. చాలా రోజుల పాటు దుర్గ గుడి విగ్రహ ధ్వంసం మీడియాలో ప్రముఖంగా వినిపించింది.

ఈ యేడాది ఫిబ్రవరిలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా పోలీస్ స్టేషన్లను జగన్ కొన్ని ప్రాంతాలలో ప్రారంభించారు. అదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం లో అమ్మవారి విగ్రహం నేలకూలింది. అలాగే నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.,

అమ్మ ఒడి మొదటి విడత ప్రారంభించే సమయంలోనూ జగన్కు ఆటంకాలు ఎదురయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఇది సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం తీసుకు వచ్చింది. దీంతో అమ్మ ఒడి మొదటి విడత కు సరైన ప్రాధాన్యం దక్కలేదు.

డ్వాక్రా మహిళలకు జగన్ అన్న ఆసరా ప్రకటించే సమయంలో దుర్గగుడి లో రెండు సింహాలు మాయమయ్యాయి. దీంతో అసలు ఆసరా పథకం ముఖ్య ఉద్దేశాన్ని మీడియా పక్కనపెట్టేసింది.

అలాగే వైయస్సార్ జలకళ పథకం ప్రకటించిన రెండు రోజులు ముందు ఓ విగ్రహం కోసం అయితే జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభించి మూడు రోజుల ముందు మంత్రాలయంలో మరో ఆలయం పై దాడి జరిగింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇవ్వలే నట్లుగా 56 బిసి కులాలకు కార్పొరేషన్ను ప్రకటించే సమయంలోనూ తలపాడు లో ఓ విగ్రహం ధ్వంసం అయింది.

కావాలనే ప్లాన్!

ఇదంతా చూస్తే లోతుగా ఆలోచిస్తే ఎవరో కావాలని ప్రభుత్వ పథకాలు అమలు అయ్యే సమయంలో సరిగ్గా హిందూ ఆలయాల దాడులను పెరుగుతున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హిందు ఆలయాలు దాడుల కేసుల్లో కచ్చితంగా కుట్ర ఉందని ఆయన శుక్రవారం మీడియాకు చెప్పారు. అయితే ఈ దాడుల్లో ఎవరైనా ఒక దోషి బయటకు వస్తే మొత్తం కుట్రకోణం చేదించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి