iDreamPost

OTT Releases : ఓటిటిలో భారీ సినిమాల సందడి

OTT Releases : ఓటిటిలో భారీ సినిమాల సందడి

థియేటర్లు తెరుచుకున్నాయి కాబట్టి డైరెక్ట్ ఓటిటి రిలీజులు పెద్దగా ఉండవనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. తెలుగులో తగ్గింది కానీ తమిళ మలయాళంలో మాత్రం ఈ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. పెద్ద స్టార్ హీరోలు సైతం తమ నిర్మాతలు డిజిటల్ వైపు వెళ్తుంటే నో చెప్పడం లేదు. మోహన్ లాల్ – పృథ్విరాజ్ కాంబోలో రూపొందిన ‘బ్రో డాడీ’ని హాట్ స్టార్ రేపు స్ట్రీమింగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లూసిఫర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ అయినప్పటికీ నిర్మాత థియేటర్లకు ఇచ్చే సాహసం చేయలేదు. కేరళలో పరిస్థితి అలా ఉంది మరి.

చియాన్ విక్రమ్ అతని కొడుకు ధృవ్ ఫస్ట్ టైం కలయికలో రానున్న ‘మహాన్’ని ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో తీసుకొస్తున్నారు. పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ యక్షన్ థ్రిల్లర్ భారీ బడ్జెట్ తో రూపొందింది. అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగు కన్నడ మలయాళంలో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ధనుష్ కొత్త మూవీ ‘మారన్’ సైతం వచ్చే నెల హాట్ స్టార్ లో రాబోతోంది. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. 16తో తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన కార్తీక్ నరేన్ దీనికి దర్శకుడు. ఇది కూడా యాక్షన్ ఎంటర్ టైనరే. జగమే తంత్రం నిరాశ పరిచాక ధనుష్ నుంచి వస్తున్న ఓటిటి సినిమా ఇదే.

ఈ మూడే కాదు మరికొన్ని భారీ చిత్రాలు ఓటిటి టాక్స్ లో ఉన్నాయి. థియేటర్లు రన్ అవుతున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో పెట్టుబడులు సేఫ్ అవ్వాలంటే ఇంతకంటే మార్గం లేదని భావిస్తున్న నిర్మాతలు మంచి డీల్ వస్తే డిజిటల్ కు అమ్మేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. సినిమా హాళ్లు నడుస్తున్నా సరే ఇకపై రిలీజ్ విషయంలో నిర్మాతలకు ఎప్పుడూ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి మూవీ థియేటర్ కే వస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి చిన్నా పెద్ద హీరోలనే తేడాలుండవని అర్థమయ్యిందిగా

Also Read : Buchi Babu Sana : బ్లాక్ బస్టర్ సాధించినా గ్యాప్ తప్పలేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి