iDreamPost

Bheemla Nayak : 90 కోట్ల టార్గెట్ తో పవన్ రిపోర్టింగ్

Bheemla Nayak : 90 కోట్ల టార్గెట్ తో పవన్ రిపోర్టింగ్

ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా జనవరి 12 నుంచి భీమ్లా నాయక్ తప్పుకునే సీన్ కనిపించడం లేదు. నిన్న నిర్మాత నాగ వంశీ మరోసారి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ పిక్ ని వైరల్ చేసేశారు. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లు ఉన్నాయి కాబట్టి పవన్ పోస్ట్ పోన్ చేసుకుంటుంటే బాగుంటుందనే పలువురి సలహాలను సితార సంస్థ లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ముందు ప్రకకటించింది మేమే కాబట్టి ఎందుకు మార్చుకోవాలన్న వాళ్ళ లాజిక్ కరెక్టే కానీ అన్ని సినిమాల కలెక్షన్ల గురించి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న మాట వాస్తవం. కొద్దిరోజులయ్యాక పొరపాటున వాయిదా అంటే సోషల్ మీడియాలో జరిగే రచ్చ మాములుగా ఉండదు.

ఇదిలా ఉండగా భీమ్లా నాయక్ డీల్స్ హాట్ కేక్స్ లా పూర్తవుతున్నాయి. సుమారు 90 నుంచి 95 కోట్ల మధ్య థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇది అటుఇటుగా వకీల్ సాబ్ కు జరిగినంతే. ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారం కొలిక్కి రాదనే కోణంలో డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడిమేరకు పది కోట్లకు పైగా తగ్గించుకుని ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. సోలోగా ఇంకెప్పుడైనా వచ్చి ఉంటే ఈ మొత్తం కూడా తోడయ్యేది కానీ వంశీ మనసు మార్చుకునే మూడ్ లో లేరు కాబట్టి దాదాపుగా డేట్ మారే సూచనలు లేవు. శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ ఎంతకు చేసుకున్నారనేది తెలియాల్సి ఉంది. అన్ని కలిపితే డబుల్ సెంచరీ దగ్గరగా వెళ్తుంది.

భీమ్లా నాయక్ మీద ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం కంటెంట్ ఒకటే కాదు. పవన్ మాస్ అవతారం, త్రివిక్రమ్ రచన, పారితోషికాలు పక్కనబెడితే చాలా రీజనబుల్ బడ్జెట్ లో సినిమా పూర్తవ్వడం లాంటివి చెప్పుకోవచ్చి. ఇప్పటీకే తమన్ స్వరపరిచిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మలయాళం అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో రానాతో పాటు నిత్య మీనన్, సంయుక్త మీనని హీరోయిన్లుగా నటించారు. ఒరిజినల్ వెర్షన్ లో లేని కొన్ని కీలక మార్పులను జోడించి, నిడివి కూడా రెండున్నర గంటలకే లాక్ చేయాలని నిర్ణయించుకున్నారట. రాబోయే రోజుల్లో అప్డేట్స్ ని టీమ్ వేగవంతం చేయబోతోంది

Also Read : Sankranthi Clashes : పోటా పోటీ యుద్ధంలో నలిగేది సినిమాలే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి