iDreamPost

Bheemla Nayak : టాక్ అఫ్ ది ట్రేడ్ గా మారిన పవన్ మూవీ

Bheemla Nayak : టాక్ అఫ్ ది ట్రేడ్ గా మారిన పవన్ మూవీ

భీమ్లా నాయక్ విడుదల తేదీని మరోసారి ఫిబ్రవరి 25గా ఇంకా ధ్రువీకరించలేదు కానీ బిజినెస్ డీల్స్ మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. క్రేజీ ఆఫర్లతో నువ్వా నేనా అనే రీతిలో డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నట్టుగా సమాచారం. 100 కోట్లకు దగ్గరగా ప్రస్తుతం థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయట. ఇది ఇంకా పెరగొచ్చేమో కానీ తగ్గేది ఉండదంటున్నారు. ఎలా చూసుకున్నా ఈ సినిమాకు జరిగిన బడ్జెట్ కు ఇది భారీ లాభం. డబ్బింగ్ హక్కులు, ఓటిటి, శాటిలైట్ ఇవన్నీ కలుపుకుంటే ఈజీగా డబుల్ సెంచరీ ఖాయం. పవన్ రెమ్యునరేషన్ తో కలిపి మొత్తం పెట్టుబడి వంద కోట్లు అనుకున్నా వచ్చే మొత్తం చూసుకుంటే డబుల్ ప్రాఫిట్ అన్నమాట.

రేపు చిరంజీవితో పాటు టాలీవుడ్ పెద్దలు కొందరు ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. ఆ మీటింగ్ అయ్యాక టికెట్ రేట్లకు సంబంధించి సానుకూల జిఓ వస్తుందన్న నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అదే జరిగితే భీమ్లా నాయక్ కు రూట్ క్లియరైపోయి 25కే రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెకండ్ షోలు కూడా పునరుద్ధరణ అయితేనే ఇది సాధ్యమవుతుంది. సో ఇంకో రెండు మూడు రోజులు వేచి చూస్తే క్లారిటీ రావొచ్చు. ట్రేడ్ వర్గాల దగ్గరున్న ప్రస్తుత డేట్ 25. దానికి తగ్గట్టే థియేటర్ల అగ్రిమెంట్, అడ్వాన్సు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నాయట. ఒకవేళ వాయిదా అంటే ఏప్రిల్ 1కి తగ్గట్టు అడ్జస్ట్ మెంట్లు చేస్తారు.

ఒకవేళ భీమ్లా నాయక్ 25కే ఫిక్స్ అయితే ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ లో ఒకరు తప్పుకోవడం ఖాయం. దానికన్నా ఒక రోజు ముందు వలిమై వచ్చి ఉంటుంది కాబట్టి స్క్రీన్ల పరంగా ప్రాబ్లమ్ రావొచ్చు. పవన్ తో ఫేస్ టు ఫేస్ క్లాష్ కు శర్వానంద్, కిరణ్ అబ్బవరంలో ఎవరు సిద్ధపడతారనేది వేచి చూడాలి. నిజానికి భీమ్లా నాయక్ ప్రీ రిపోర్ట్స్ అభిమానులను బాగా ఎగ్జైట్ చేస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో హీరోయిజం ఓ రేంజ్ లో పండిందని, చాలా కాలం తరువాత గబ్బర్ సింగ్ రేంజ్ మాస్ చూడబోతున్నామనే ఇన్ సైడ్ టాక్ అంచనాలు పెంచుతోంది. భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ రచన చేయగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు

Also Read : New OTT Releases : డిజిటల్ వినోదానికి లోటు లేదుగా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి