iDreamPost

‘భరణి’ హీరోయిన్‌ గుర్తుందా?.. ఇప్పుడింతలా మారిపోయిందేంటి?

విశాల్‌ హీరోగా 2007లో వచ్చిన ‘తామిర భరణి’ సినిమా తెలుగులో ‘భరణి’గా డబ్‌ అయి రిలీజైంది. ఈ సినిమా ద్వారా ముక్త మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు కూడా వచ్చాయి. కానీ,...

విశాల్‌ హీరోగా 2007లో వచ్చిన ‘తామిర భరణి’ సినిమా తెలుగులో ‘భరణి’గా డబ్‌ అయి రిలీజైంది. ఈ సినిమా ద్వారా ముక్త మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు కూడా వచ్చాయి. కానీ,...

‘భరణి’ హీరోయిన్‌ గుర్తుందా?.. ఇప్పుడింతలా మారిపోయిందేంటి?

చిత్ర పరిశ్రమ కూడా ఓ జూదం లాంటిది. ఇక్కడ నేమ్‌, ఫేమ్‌ శాశ్వతం కాదు.. ఒక్క సినిమాతో దశ తిరిగి స్టార్‌ అయిపోవచ్చు.. ఒక్క సినిమా కారణంగానే జీవితం మొత్తం అథఃపాతాళానికి పడిపోవచ్చు. ప్లాపులు ఎక్కువయ్యే కొద్దీ అవకాశాలు తగ్గుతూ పోతాయి. అవకాశాలు తగ్గే కొద్దీ సినిమాలు చేయాలన్నా ఆసక్తి చచ్చిపోతుంది. అందుకే.. హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందాన.. స్టార్‌గా వెలుగొందుతున్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ ఉంటారు.

అవకాశాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. విశాల్‌ హీరోగా వచ్చిన ‘భరణి’ సినిమా హీరోయిన్‌ కూడా అవకాశాలు తగ్గగానే ఇండస్ట్రీకి దూరం అయ్యారు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు.  ముక్త 2005లో వచ్చిన మలయాళ సినిమా ఒట్ట నానయమ్‌ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరుసటి సంవత్సరం ‘ఫొటో’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.

అందుకే ఆమెకు తెలుగులో ఏ అవకాశాలు రాలేదు. 2007లో విశాల్‌ హీరోగా ‘‘తామిర భరణి’’ అనే సినిమాలో నటించారు. ఇది ఆమె మొదటి తమిళ సినిమా. ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. డెబ్యూ నటిగా విజయ్‌ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తెలుగులో భరణి సినిమాగా డబ్‌ అయి రిలీజ్‌ అయింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి రెస్సాన్స్‌ను సొంతం చేసుకుంది. భరణి సాధించిన విజయంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. మాతృభాష మలయాళంతో పాటు తమిళంలోనూ సినిమాలు చేశారు.

2014లో వచ్చిన డార్లింగ్‌ అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హీరోయిన్‌గా పీక్‌లో ఉన్నపుడే 2015లో రింకు టామీని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్నేళ్లు సినిమాలు చేశారు. అయితే, అవకాశాలు తగ్గటంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. బుల్లి తెరపై బిజీ అయిపోయారు. హోస్ట్‌గా పలు షోలను నిర్వహించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె నటిస్తున్న ‘ కురివి పాప’ అనే మలయాళ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఇక, ముక్త అలియస్‌ భాను సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ముక్త తాజాగా జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టారు. మరి, ముక్త చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by KIARA RINKU TOMY (@kanmanikiara)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి