iDreamPost

OTT suggestion: ఈ వెబ్ సిరీస్ లు అస్సలు మిస్ కావొద్దు.. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్..

  • Published Mar 13, 2024 | 4:36 PMUpdated Mar 14, 2024 | 3:54 PM

ఓటీటీ లో ఇప్పుడు సిరీస్ లు, సినిమాలకు కొదవే లేదు. అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కలిపి ఇప్పటివరకు కొన్ని వందల్లో సినిమాలు ఉండి ఉంటాయి. మరి వాటిలో బెస్ట్ ఏవి ! అందులో స్టూడెంట్స్ కు యూజ్ అయ్యే సిరీస్ లు కూడా ఉన్నాయట. అవేంటో చూసేద్దాం.

ఓటీటీ లో ఇప్పుడు సిరీస్ లు, సినిమాలకు కొదవే లేదు. అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కలిపి ఇప్పటివరకు కొన్ని వందల్లో సినిమాలు ఉండి ఉంటాయి. మరి వాటిలో బెస్ట్ ఏవి ! అందులో స్టూడెంట్స్ కు యూజ్ అయ్యే సిరీస్ లు కూడా ఉన్నాయట. అవేంటో చూసేద్దాం.

  • Published Mar 13, 2024 | 4:36 PMUpdated Mar 14, 2024 | 3:54 PM
OTT suggestion: ఈ వెబ్ సిరీస్ లు అస్సలు మిస్ కావొద్దు.. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్..

ఇప్పుడు ఓటీటీలో ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతున్నాయి. కాబట్టి ఆడియన్సుకు కన్ఫ్యూజన్ లేకుండా.. వాటిలో ఏ మూవీ, సిరీస్ బావుంటుందో కూడా .. ఓటీటీ లో సజ్జెషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. లాంగ్వేజ్ తో, జోనర్ తో సంబంధం లేకుండా .. అన్ని సినిమాలకు, సిరీస్ లకు కంటెంట్ ని బట్టి.. ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే వాటిలో కొన్ని సినిమాలు, సిరీస్ లు మాత్రం ఎంటర్టైన్మెంట్ తో పాటు.. ఆడియన్స్ కు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ను మోటివేట్ చేసేలా.. వాళ్ల భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చేలా ఎన్నో వెబ్ సిరీస్ లు, సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాలను, సిరీస్ లను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం.. వారు తప్పకుండ చూడాలసిందే. మరి, ఓటీటీ లో ఉన్న బెస్ట్ మూవీస్ ఏంటో .. ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

కాలేజీ స్టూడెంట్స్ కు యూజ్ అయ్యే బెస్ట్ మూవీస్, సిరీస్ ఇవే

1) కోటా ఫ్యాక్టరీ – నెట్‌ఫ్లిక్స్
ఐఐటీ-జేఈఈ ఆస్పిరెంట్స్ గురించి డిస్కస్ చేసే కథ ఇది. సాధారణంగా ఇంకా కోచింగ్ సెంటర్స్ అంటే .. విద్యార్థులను చాలా ఒత్తిడికి గురి చేస్తుంటారు. విద్యార్థులకు ఇటువంటి లక్ష్యాలు ఉండడం మంచిదే. కానీ, ఆ పేరుతో వారిని మానసిక ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు. ఈ తరహాలోనే కోచింగ్ సెంటర్లు వాళ్లపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నారో ఈ సిరీస్ ద్వారా .. తెలిపే ప్రయత్నం చేశారు. స్టూడెంట్స్ తో పాటు.. పేరెంట్స్ కూడా చూడాల్సిన బెస్ట్ సిరీస్. ఈ సీజన్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ కోసం రెడీ అయింది.

2) ఆస్పిరెంట్స్ – ప్రైమ్ వీడియో
ఆస్పిరెంట్స్ అనే పదం వినగానే అందరికి గుర్తొచ్చేది ఐఏఎస్ పరీక్షలే. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో సివిల్ సర్వీసెస్ పరీక్ష ఒకటి. ఈ పరీక్ష పాసవ్వాలని కలలు కనే లక్షలాది మంది ఆస్పిరెంట్స్ జీవితాలకు.. అద్దం పట్టేలా ఈ సిరీస్ ఉంటుంది. సివిల్స్ పాసవ్వాలని ఢిల్లీ వచ్చే ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత గొప్ప స్నేహితులుగా ఎలా మారారు? వాళ్ల కల నెరవేరిందా? సివిల్స్ లక్ష్యం సాధించాలంటే ఏం చేయాలి? ఎలా కష్టపడాలి? ఒకవేళ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా సరే.. మనోధైర్యం కోల్పోకుండా ఎలా ముందుకు
సాగాలి అన్నదే ఈ సిరీస్ కథ. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.

3) పంచాయత్ – ప్రైమ్ వీడియో
దేశంలో ఏటా లక్షల్లో ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వస్తూ ఉంటారు. వారిలో ఇంజినీరింగ్ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలని భావించే వారు చాలా మంది ఉంటారు. ఈ క్రమంలోనే తన ఇంజినీరింగ్ తర్వాత ఓ పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేయాలనీ కలలు కన్న యువకుడు.. చివరికి ఓ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ యువకుడు ఎటువంటి కష్ఠాలను పడ్డాడు. ఆ ఊరి బాగుకోసం ఎలా శ్రమించాడు? అనేదే ఈ సిరీస్ కథ.

4) సెలెక్షన్ డే -నెట్‌ఫ్లిక్స్
జీవితంలో ఎదో సాధించాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అయితే, అది కేవలం చదువుతోనే సాధ్యం అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ, జీవితంలో చదువుతో మాత్రమే కాకుండా ఆటలతో కూడా.. గొప్ప స్థాయికి చేరుకోవచ్చని.. ఈ సిరీస్ సారాంశం. అలా ఓ దేశంలో ఎంతో ప్రేమగా భావించే ఆటైనా క్రికెట్ కోసం.. ఇద్దరు అన్నదమ్ములు పడే శ్రమను ఈ సిరీస్ లో చూపించారు.

5) హాఫ్ సీఏ – యూట్యూబ్, మినీ టీవీ
ఈ హాఫ్ సీఏ వెబ్ సిరీస్ మినీ టీవీ రూపొందించిన వెబ్ సిరీస్. ఈ సిరీస్ ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ టైటిల్ ను బట్టి చెప్పేయొచ్చు ఇది చార్టెడ్ అకౌంటెంట్స్ కు సంబంధించిన సిరీస్ అని. దేశంలో ఎంతో కఠినమైన కోర్సుల్లో ఒకటి చార్టెడ్ అకౌంటంట్. ఈ కోర్సును చదవాలి అనుకునే వారు పడే కష్టాలు, చివరికి వారి అటెంప్ట్స్ అన్ని ముగిసాక .. అటు సీఏ కంప్లీట్ చేయలేక హాఫ్ సీఏ గా మిగిలిపోయిన వారి జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది ఈ సిరీస్.

మరి, స్టూడెంట్స్ జీవితాలకు అద్దం పట్టేలా ఉన్న ఈ సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి