iDreamPost

చెవులు కుట్టించుకుంటే ఇన్ని ప్రయోజనాలా??

చెవులు కుట్టించుకుంటే ఇన్ని ప్రయోజనాలా??

ఒకప్పుడు చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఎంతో సాంప్రదాయబద్దంగా జరిపేవాళ్లు. కొంతమంది మగవాళ్ళు కూడా కుట్టించుకునే వాళ్ళు. ఆడవాళ్ళకి ఎక్కువగా చిన్నప్పుడే చెవులు కుట్టించే కార్యక్రమం చేస్తారు. అయితే ఇటీవల ఎక్కువగా ఎవరూ చెవులు కుట్టించుకోవట్లేదు. కొంతమంది ఫ్యాషన్ గా పెట్టుకున్నా కుట్టించుకోకుండా, అతుక్కునేవి పెట్టుకుంటున్నారు. చెవులు కుట్టించడం ఆచారం, ఫ్యాషన్ కాకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది.

చెవులకు మన ముఖం లోని కళ్ళు, ముక్కు, పళ్లతో సంభంధం ఉంటుంది. చెవులు కుట్టడం వలన కళ్ళు ప్రకాశవంతంగా కనబడతాయి. చెవులు కుట్టించుకున్న వారిలో మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీలలో వచ్చే అసాధారణ రుతుక్రమ సమస్యలు కూడా రాకుండా ఉండేలా చేస్తుంది. పునరుత్పత్తిలో కూడా చెవి కుట్టించుకోవడం సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. చెవులు కుట్టడం వలన ఆ ప్రాంతంలో ఉండే అన్ని రకాల నాడులు ఉత్తేజితం అవుతాయి.

చెవులు కుట్టించుకున్న మగవారికి పక్షవాతం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. మగవారిలో హెర్నియా, హైడ్రోసిల్ సమస్యలను రాకుండా ఉండేలా చేస్తాయి. ఆందోళన మానసిక రుగ్మతలు రాకుండా ఉంటాయి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెవి మధ్య ప్రాంతం రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినది, కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లలకు చెవులు కుట్టించాలి. మన పెద్దలు చెప్పే ఆచారాల్లో కచ్చితంగా అంతర్లీనంగా ఒక మంచి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి