iDreamPost

ప్రీమియర్ షోలు! ప్లస్ కంటే మైనస్ లే ఎక్కువనా..?

  • Author ajaykrishna Published - 11:51 AM, Wed - 11 October 23
  • Author ajaykrishna Published - 11:51 AM, Wed - 11 October 23
ప్రీమియర్ షోలు! ప్లస్ కంటే మైనస్ లే ఎక్కువనా..?

ఇండస్ట్రీలో రిలీజ్ కి సిద్ధమైన సినిమాలను ప్రచారం చేయడంలో డిఫరెంట్ మార్గాలు ఎంచుకుంటారు మేకర్స్. గతంలో ఆడియో ఫంక్షన్స్ జరిపి సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసేవారు. ఆ తర్వాత ఆడియో ఫంక్షన్స్ పోయి.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వచ్చాయి. అంటే.. ఈ ఈవెంట్ కి సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ లకు సంబంధం ఉండదు. ఎందుకంటే.. ప్రీ రిలీజ్ కు ముందే అన్ని ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కట్ చేస్తే.. కొత్తగా అన్ని సినిమాలు ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. అదే ప్రీమియర్ షోస్. రిలీజ్ ముందురోజు లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఈ మధ్య ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రీమియర్ షోస్ అనేవి అన్ని సినిమాలకు వర్కౌట్ అవ్వడం కష్టం. ఎందుకంటే.. కంటెంట్ బట్టి సినిమాలకు ఫలితాలు డిసైడ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు ఎలాంటి ప్రీమియర్స్ లేకుండా అద్భుతమైన ఫలితాలు అందుకుంటున్నాయి. అంతెందుకు గతంలో రిలీజ్ ముందురోజు స్పెషల్ షోస్ వేయడం అనేది టాలీవుడ్ లో లేదు. అవసరం అనుకుంటే.. రిలీజ్ రోజే ఎర్లీ మార్నింగ్ షోస్ వేసేవారు. ఇప్పుడు ప్రతీ పాన్ ఇండియా సినిమాకు అది కామన్ అయిపోయింది. ఆ విషయం పక్కన పెడితే.. ప్రీమియర్స్ వేయడం వలన కొన్ని సినిమాలకే ప్లస్ అవుతుంది. ఎక్కువ శాతం మైనస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓపెనింగ్స్ బాగా రావాలని ప్రీమియర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ.. కుదరట్లేదు. ఈ మధ్యకాలంలో బేబీ, సామజవరగమన, మేజర్, బలగం లాంటి సినిమాలు ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. ఆ తర్వాత మంచి విజయం అందుకున్నాయి. వాస్తవానికి ప్రీమియర్ షోలకు మూవీ టీమ్ కూడా వస్తుంది. కాబట్టి.. సినిమా ఎలా ఉన్నా.. వాళ్లు డిజపాయింట్ కాకూడదని సూపర్ చెప్పేసి వెళ్తుంటారు. అది అన్ని వేళలా జరగదు. కానీ.. మాక్సిమమ్ జరుగుతుంటాయి. అయితే.. ఇక్కడ సినిమాలను పాటలు, ట్రైలర్స్ తో ముందునుండి ప్రిపేర్ చేసి ఉంచడం చాలా ముఖ్యం. తీరా రిలీజ్ కి నాలుగు రోజుల ముందు హడావిడి చేస్తే ఫలితాలు మారవు. గతవారం విడుదలైన 800, మంత్ ఆఫ్ మధు, మామా మశ్చింద్ర.. అంతకుముందు వ్యాక్సిన్ వార్ విషయంలో ఏమైందో చూశాం. అందుకే ప్రీమియర్స్ వేసినా వేయకపోయినా.. కంటెంట్ బాగుంటే సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి అనేది ఫిక్స్. మరి ప్రీమియర్ షోస్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి