iDreamPost

సెకండ్ హ్యాండ్ వాహనం కొంటున్నారా? ఐతే దొంగ బండో కాదో ఇలా తెలుసుకోండి

మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా? అయితే కొనే ముందు ఒకసారి ఆ బండి దొంగ బండా? లేక అమ్మే వ్యక్తిదేనా అని తనిఖీ చేసుకోండి. లేదంటే మోసపోయే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకే వస్తుంది కదా కొనుగోలు చేస్తే సమస్యల్లో చిక్కుకుంటారు.

మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా? అయితే కొనే ముందు ఒకసారి ఆ బండి దొంగ బండా? లేక అమ్మే వ్యక్తిదేనా అని తనిఖీ చేసుకోండి. లేదంటే మోసపోయే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకే వస్తుంది కదా కొనుగోలు చేస్తే సమస్యల్లో చిక్కుకుంటారు.

సెకండ్ హ్యాండ్ వాహనం కొంటున్నారా? ఐతే దొంగ బండో కాదో ఇలా తెలుసుకోండి

చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్స్, కార్స్ కొంటూ ఉంటారు. అయితే కొనే ముందు బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదంటే మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బైక్, స్కూటీ దొంగలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఒక చోట కొట్టేసిన వాహనాలని తక్కువ రేటుకి వేరొకరికి అమ్మేస్తుంటారు. ఉదాహరణకు లక్ష రూపాయల బండిని ఎత్తుకొచ్చిన దొంగ.. 30 వేలకే అమ్మేస్తున్నా అని అంటాడు. ఈ ఆఫర్ ఏదో టెంప్టింగ్ గా ఉంది కదా అని వెనకా ముందు ఆలోచించకుండా కొనేసే వాళ్ళు ఉంటారు. బండిలో డాక్యుమెంట్స్ ఉంటే వాటిని కొనే వ్యక్తికి చూపిస్తాడు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా.. కరెక్ట్ గానే ఉన్నాయి అని కొంటే ఇక మీ పని అంతే.

ఎందుకంటే ఆ దొంగ ఎవరి బండి ఎత్తుకొచ్చాడో తెలియదు కదా. ఆ వాహన యజమాని పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు ఆ వాహనం యొక్క వివరాలన్నీ క్రిమినల్ డేటా బేస్ లో చేరతాయి. మరి బండి కొనే ముందు ఈ వివరాలు తెలుసుకోలేమా అంటే తెలుసుకోవచ్చు. అందుకోసమే భారత ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ని రూపొందించింది. ఈ వెబ్ సైట్ ద్వారా మీరు కొనే సెకండ్ హ్యాండ్ వెహికల్ అసలుదా? లేక ఎత్తుకొచ్చిందా? అనేది తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 

Fake bikes check in this site

దొంగ బండో కాదో ఇలా నిర్ధారించుకోండి:

  • గూగుల్ లో CCTNS అని టైప్ చేస్తే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ వెబ్ సైట్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
  • పేజ్ లో సిటిజన్ లాగిన్ ఆప్షన్ కనబడుతుంది.
  • బైక్ అమ్మాలనుకుంటున్న వ్యక్తి వివరాలతో లాగిన్ అవ్వాలి. ఆ వ్యక్తి మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసి.. అతని పేరు నమోదు చేయాలి.
  • ఆ తర్వాత క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయిన తర్వాత ‘జనరేట్ వెహికల్ ఎన్ఓసీ’ అనే ఆప్షన్ కనబడుతుంది.
  • దాని మీద క్లిక్ చేసి వెహికల్ టైప్ కారు ఐతే కారుని, మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ ని, స్కూటర్ అయితే స్కూటర్ ని సెలెక్ట్ చేయాలి.
  • ఆ తర్వాత వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, ఇంజన్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • అన్ని వివరాలు ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి.

Fake bikes check in this site

వాహన హిస్టరీ:

అన్ని వివరాలు నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్ఓసీ జనరేట్ అయ్యి ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. అందులో ఆ బండి యజమాని పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్ ఉంటాయి. దీని కింద ఒక మేటర్ ఉంటుంది. పోలీస్ క్రిమినల్ డేటాబేస్ లో మీరు ఎంటర్ చేసిన వాహనం యొక్క హిస్టరీ క్లీన్ గా ఉంది. ఎలాంటి కేసులు లేవు అని చూపిస్తుంది. ఒకవేళ ఉంటే కనుక ఉన్నట్టు చూపిస్తుంది. ఎవరిదైనా బండి దొంగతనం జరిగినప్పుడు పోలీస్ కేసు పెడతారు. దీంతో పోలీసులు బండి రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజన్ నంబర్ వివరాల ఆధారంగా కేసు నమోదు చేస్తారు. ఈ వివరాలను CCTNS వెబ్ సైట్ లో స్టోర్ చేస్తారు. దీని వల్ల దొంగ వాహనాలను గుర్తించవచ్చు. మరి మీ దగ్గరకు ఎవరైనా సెకండ్ హ్యాండ్ బండి అమ్మేందుకు వస్తే.. ఇలా నిమిషాల్లో వెబ్ సైట్ లో చెక్ చేసి దొంగ వెహికలా కాదా అనేది నిర్ధారించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ లో షేర్ చేసి వారికి అవగాహన కల్పించండి.   

Fake bikes check in this site

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి