iDreamPost

Rishabh Pant: పంత్ ను పక్కన పెడుతున్న BCCI! కారణం ఏంటంటే?

రిషబ్ పంత్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. అతడిని బీసీసీఐ మరికొన్ని రోజులు పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

రిషబ్ పంత్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. అతడిని బీసీసీఐ మరికొన్ని రోజులు పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Rishabh Pant: పంత్ ను పక్కన పెడుతున్న BCCI! కారణం ఏంటంటే?

రిషబ్ పంత్.. సరిగ్గా ఇదే రోజున(డిసెంబర్ 30, 2022) కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనలోంచి తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు పంత్. ఆస్పత్రిలో నెలల కొద్ది చికిత్స తీసుకుని, క్రమంగా ఆ గాయాల నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని, గ్రౌండ్ లోకి ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి సత్తా చాటుదామా అని ఎదురుచూస్తున్నాడు. ఇక తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వస్తున్నాడు. కాగా.. పంత్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పంత్ ను బీసీసీఐ పక్కనపెడుతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

టీమిండియాలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇద్దామా అని, ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. సంవత్సరం క్రితం కార్ యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడ్డ పంత్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడు జిమ్ లో చేస్తున్న వర్కౌట్లను చూస్తుంటే.. ప్రస్తుతం పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగే ఛాన్స్ లు కనిపిస్తున్నాయని భావించారు ఫ్యాన్స్. కానీ వారికి ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఇంగ్లాండ్ తో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు పంత్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కానీ.. రిషబ్ పంత్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా, అతడిని కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉంచాలని భావిస్తోందట బీసీసీఐ. దానికి కారణం ఏంటంటే? ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్న పంత్ ను వన్డేలు, టెస్ట్ లు లాంటి సుదీర్ఘ ఫార్మాట్స్ కు ఎంపిక చేస్తే.. అతడిపై భారం పెరిగి గాయాలు మళ్లీ తిరబెట్టొచ్చు అనేది బీసీసీఐ అనుమానం. దీంతో పంత్ ఫిట్ నెస్ సాధించినప్పటికీ.. కొన్ని రోజులు పక్కనపెట్టాలి అనేది బీసీసీఐ ప్లాన్. అదీకాక వచ్చే ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇది దృష్టిలో పెట్టుకునే పంత్ కు మరింత రెస్ట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా.. పంత్ ఐపీఎల్ ఆడతాడా? లేడా? అన్నది నేషనల్ క్రికెట్ అకాడమీ ఇచ్చే సర్టిఫికెట్ పై ఆధారపడి ఉంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి