iDreamPost

IND vs ENG: ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ప్రకటన.. బీసీసీఐ సరికొత్త ప్రయోగం!

ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇక టీమ్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. అయితే ఈ సిరీస్ తో బీసీసీఐ సరికొత్త ప్రయోగం చేస్తోంది. మరి ఆ ప్రయోగం ఏంటి?

ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇక టీమ్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. అయితే ఈ సిరీస్ తో బీసీసీఐ సరికొత్త ప్రయోగం చేస్తోంది. మరి ఆ ప్రయోగం ఏంటి?

IND vs ENG: ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ప్రకటన.. బీసీసీఐ సరికొత్త ప్రయోగం!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత అందరి చూపు ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ పైనే పడింది. మధ్యలో ఆఫ్గానిస్తాన్ తో టీ20 టోర్నీ ఉన్నప్పటికీ.. అది అంతగా ప్రాధాన్యతను సంతరించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ఎవరిని ఎంపిక చేస్తారు? అన్న ఆసక్తితో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు టెస్టులకు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇక టీమ్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందాడు సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అయితే ఈ సిరీస్ తో బీసీసీఐ సరికొత్త ప్రయోగం చేస్తోంది. మరి ఆ ప్రయోగం ఏంటి? జట్టులోకి ఎవరిని తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.

టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఇందుకోసం టీమిండియా జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందాడు స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా. తొలి రెండు టెస్ట్ లకు మాత్రమే టీమ్ ను ప్రకటించింది. ఇక జట్టు కూర్పు విషయానికి వస్తే.. ఈసారి బీసీసీఐ సరికొత్త ప్రయోగం చేసిందనే చెప్పాలి. ఓపెనర్లుగా రోహిత్ తో పాటుగా గిల్ లేదా జైస్వాల్ దిగనుండగా.. మిడిలార్డర్ లో విరాట్, అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నారు.

అయితే అనూహ్యంగా ముగ్గురు వికెట్ కీపర్లను ఈ సిరీస్ కు ఎంపిక చేసింది మేనేజ్ మెంట్. రెగ్యూలర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తో పాటుగా తెలుగు కుర్రాడు కేఎస్ భరత్, మరో యువ ఆటగాడు ధృవ్ జురెల్ ను జట్టులోకి తీసుకుంది. ఈ టెస్టు సిరీస్ తో జురెల్ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. ఈ 22 ఏళ్ల యువ క్రికెటర్ ఐపీఎల్ 13 మ్యాచ్ లు ఆడాడు. అయితే ఇప్పుడు అందరి డౌట్ ఒక్కటే. బీసీసీఐ ఎందుకు ముగ్గురు వికెట్ కీపర్లను ఈ సిరీస్ కు ఎంపిక చేసిందని. దీనికి కారణాలు లేకపోలేదు.

పరిమిత ఓవర్లలో రెగ్యూలర్ వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న పంత్ ప్రమాదం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం. అతడు అందుబాటులోకి వచ్చేసరికి మరికాస్త సమయం పడుతుండటం, ఇక కేఎల్ రాహుల్ ఒక్కడిపైనే భారం పడుతుండటంతో.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్ ను అడపాదడపా మ్యాచ్ లకు మాత్రమే తీసుకుంటుండటంతో.. బ్యాకప్ కోసం ఇప్పటి నుంచే కీపర్లను తీర్చిదిద్దే పనిలో పడింది మేనేజ్ మెంట్. అందులో భాగంగానే యువ ప్లేయర్లను సానపడుతోంది. ధృవ్ జురెల్ గతేడాదే ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. 15 మ్యాచ్ ల్లో 46 సగటుతో 790 రన్స్ చేశాడు. మరి ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేసిన భారత జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి