iDreamPost

BAN vs NZ: న్యూజిలాండ్ పై చారిత్రక విజయం.. బంగ్లా ప్లేయర్లకు బంపరాఫర్?

  • Author Soma Sekhar Published - 11:30 AM, Sun - 3 December 23

న్యూజిలండ్ పై చారిత్ర విజయాన్ని సాధించింది బంగ్లాదేశ్. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు బంగ్లా ఆటగాళ్లకు బంపరాఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం.

న్యూజిలండ్ పై చారిత్ర విజయాన్ని సాధించింది బంగ్లాదేశ్. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు బంగ్లా ఆటగాళ్లకు బంపరాఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం.

  • Author Soma Sekhar Published - 11:30 AM, Sun - 3 December 23
BAN vs NZ: న్యూజిలాండ్ పై చారిత్రక విజయం.. బంగ్లా ప్లేయర్లకు బంపరాఫర్?

‘హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటావ్’.. ఈ డైలాగ్ అన్ని రంగాలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. మరీ ముఖ్యంగా క్రికెట్ కు. సాధారణంగా క్రికెట్ లో పసికూన జట్లను తక్కువ చేసి చూస్తూ ఉంటాయి పెద్ద జట్లు. కానీ ప్రస్తుతం ఈ ట్రెండ్ మారింది. ఈ విషయం తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో రుజువు చేశాయి చిన్న జట్లు. పెద్ద పెద్ద టీమ్స్ కు షాకిచ్చిన విషయం మనకు తెలియనిది కాదు. కాగా.. వరల్డ్ కప్ తర్వాత కూడా ఆ సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ లో చారిత్రక విజయం సాధించి ఆశ్చర్యపరిచింది బంగ్లాదేశ్. సెల్హాట్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో 150 పరుగుల తేడాతో కివీస్ ను బంగ్లా చిత్తు చేసింది. ఇక ఈ విజయం సాధించినందుకు బంగ్లా ప్లేయర్లు బంపరాఫర్ ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు.

న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. సెల్హాట్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను 150 పరుగుల తేడాతో ఓడించింది. స్వదేశంలో కివీస్ పై బంగ్లాదేశ్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. దీంతో ఈ చారిత్రక విజయాన్ని అందించిన బంగ్లా ప్లేయర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపరాఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ విజయంలో భాగమైన బంగ్లా ప్లేయర్లకు బోనస్ ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు.

ఈ మేరకు.. “మా ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు నుంచి ప్రతి క్షణం సహకారం ఉంటుంది. సొంత గడ్డపై కివీస్ పై తొలి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ గెలుపును సెలబ్రేట్ చేసుకునేందుకు మా ప్లేయర్లకు బోనస్ ఇవ్వాలని నేను BCB అధ్యక్షుడితో మాట్లాడాను. ఆటగాళ్లు ఢాకా చేరుకున్న తర్వాత ఆయన వారితో కలిసి డిన్నర్ చేస్తారు. ఈ సందర్భంగా బోనస్ ప్రకటన వెల్లడించవచ్చు” అని చెప్పుకొచ్చాడు జలాల్ యూనస్. ఈ మ్యాచ్ లో సమష్టిగా రాణించారు బంగ్లా ఆటగాళ్లు. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. చివరిదైన రెండో టెస్టు డిసెంబర్ 26 నుంచి ఢాకా వేదికగా ప్రారంభం కానుంది. మరి చారిత్రక విజయం అందించిన ఆటగాళ్లకు బంపరాఫర్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి