iDreamPost

క్రికెట్​లోకి సరికొత్త స్టంప్స్.. ఔట్​తో పాటు బౌండరీలు, సిక్సులకూ..!

  • Published Dec 22, 2023 | 5:20 PMUpdated Dec 22, 2023 | 5:20 PM

క్రికెట్​లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆడియెన్స్​కు మంచి వ్యూయింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే అంపైరింగ్ డెసిజన్స్ మరింత కచ్చితత్వంతో ఉండేలా టెక్నాలజీ సాయంతో నూతన పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలోనే జెంటిల్మన్ గేమ్​లోకి కొత్త స్టంప్స్​ను తీసుకొచ్చారు.

ఆటల్లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేస్తూనే ఉంటారు. గేమ్స్​ను మరింత ఇంట్రెస్టింగ్​గా మార్చేందుకు ఈ ఛేంజెస్ ఉపయోగపడతాయి. క్రికెట్​లోనూ ఇలాంటి మార్పులు చేయడం చూస్తూనే ఉంటాం. గేమ్​ను బెటర్​గా చేయడంతో పాటు చూసే ఆడియెన్స్​కు, ఫ్యాన్స్​కు న్యూ ఎక్స్​పీరియెన్స్ ఇచ్చేందుకు ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. ప్రయోగాలు చేస్తుంటేనే గేమ్​కు ఏది సెట్ అవుతుంది, ఏది అవ్వదో తెలుస్తుంది. భయపడి ఎక్స్​పెరిమెంట్స్ ఆపేస్తే ప్రయోజనం ఉండదు. జెంటిల్మన్ గేమ్​లో సరికొత్త మార్పులు తీసుకొచ్చేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్​తో పాటు బీసీసీఐ, ఎంసీసీ లాంటివి ప్రయత్నిస్తుంటాయి. ఇటీవల కాలంలో బిగ్​బాష్ ప్రీమియర్ లీగ్​లో ఎక్కువగా ప్రయోగాలు చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బీబీఎల్​లో సరికొత్త స్టంప్స్​ను తీసుకొచ్చారు.

బిగ్​బాష్ లీగ్​లో తీసుకొచ్చిన స్టంప్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్​లో వాడుతున్న వికెట్ల మాదిరిగానే ఉన్నాయి. అయితే లైటింగ్ విషయంలో ఇవి కాస్త స్పెషల్ అనే చెప్పాలి. బెయిల్స్ నుంచి వికెట్ల కింద వరకు మొత్తం ఎల్​ఈడీ లైట్లతో నింపేశారు. ఈ సరికొత్త వికెట్లను ఎలక్ట్రా స్టంప్స్​గా పిలుస్తున్నారు. సాధారణంగా ప్రస్తుత క్రికెట్​లో వాడుతున్న వికెట్లు ఔట్, స్టంపౌట్, రనౌట్ అయినప్పుడు మాత్రమే లైట్లు వెలుగుతాయి. వికెట్లను బంతి, బ్యాట్ లేదా చేయి తాకినా.. బెయిల్స్ ఎగిరినా లైట్స్ వస్తాయి. ఎప్పుడు లైట్స్ వచ్చినా రెడ్ కలర్​లో మాత్రమే వెలుగుతాయి. కానీ బీబీఎల్​లో ప్రవేశపెట్టిన స్టంప్స్​లో ఐదుసార్లు లైట్స్ వస్తాయి. ఎవరైనా ఔట్ అయినప్పుడు రెడ్ కలర్​లో, బౌండరీలకు (కలర్ షిఫ్ట్), సిక్సులు (కలర్ స్క్రోలింగ్), నో బాల్ (రెడ్, వైట్ కలర్), ఓవర్ల మధ్యలో (పర్పుల్, బ్లూ కలర్) వివిధ రంగుల్లో లైట్స్ వెలుగుతాయి.

బీబీఎల్​లో వాడుతున్న కొత్త స్టంప్స్​కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వికెట్ల ధర ఎంతనేది మాత్రం ఇంకా తెలియదు. కాగా, ఈ మధ్య బిగ్​బాష్​ లీగ్​లో చేసిన కొన్ని ప్రయోగాలు నవ్వులు పాలయ్యాయి. ఏ మ్యాచ్​లోనైనా కాయిన్​తో టాస్ వేస్తారు. కానీ బీబీఎల్​లో మాత్రం బ్యాట్​తో టాస్ వేస్తారు. ఈ క్రమంలోనే ఓ మ్యాచ్​లో బ్యాట్​తో టాస్ వేయగా అది కాస్తా అటూ ఇటూ కాకుండా మధ్యలో పడింది. బ్యాట్ ఫ్లిప్​ అవడంతో బీబీఎల్ నిర్వాహకులు నవ్వులపాలయ్యారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రా స్టంప్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఇదైనా సక్సెస్ అవుతుందా? లేదా మళ్లీ విమర్శల్ని తెచ్చిపెడుతుందో అర్థం కావడం లేదు. మరి.. బీబీఎల్​లో కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రా స్టంప్స్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: KL రాహుల్ గొప్ప మనసు.. మ్యాచ్ తర్వాత..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి