iDreamPost

VIDEO: ఎవరీ బారీ మెక్‌కార్టీ? భారత బౌలర్లను వణికించాడుగా..

  • Published Aug 18, 2023 | 9:49 PMUpdated Aug 18, 2023 | 9:49 PM
  • Published Aug 18, 2023 | 9:49 PMUpdated Aug 18, 2023 | 9:49 PM
VIDEO: ఎవరీ బారీ మెక్‌కార్టీ? భారత బౌలర్లను వణికించాడుగా..

ఐర్లాండ్‌తో డబ్లిన్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు పర్వాలేదనిపించారు. ఎందుకంటే పసికూన ఐర్లాండ్‌.. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా పూర్తిగా 20 ఓవర్లు ఆడి 139 పరుగుల ఫైటింగ్‌ టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచింది. ఈ స్కోర్‌ను చూస్తే.. టీమిండియా బౌలర్లు ఆరంభంలో రాణించినా.. ఆ తర్వాత ఐర్లాండ్‌ బ్యాటర్లు టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు.

గాయం నుంచి కోలుకుని దాదాపు ఏడాది గ్యాప్‌ తర్వాత టీమిండియాలోకి తిరిగొచ్చిన బుమ్రా.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఆ తర్వాత తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడుతున్న ప్రసిద్ధ్‌ కృష్ణ సైతం రెండు వికెట్లతో చెలరేగాడు. దీంతో ఐర్లాండ్‌ కనీసం 100 పరుగులైన చేస్తుందా అనిపించింది. కానీ, కర్టిస్ కాంఫర్(33 బంతుల్లో 39 రన్స్‌), బారీ మెక్‌కార్టీ.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మెక్‌కార్టీ అయితే.. ఏకంగా హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో చెలరేగాడు.

ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌నైతే ఏ మాత్రం లెక్కచేయకుండా ఆడాడు. మెక్‌కార్టీ ఊచకోతతో అర్షదీప్‌ సింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఐర్లాండ్‌కు ఏకంగా 22 పరుగులు వచ్చాయి. అందులో ఒక ఫోర్‌, రెండు భారీ సిక్సులున్నాయి. మెక్‌కార్టీ చెలరేగడంతో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగుల చేసింది. కాగా, ఈ హాఫ్‌ సెంచరీతో మెక్‌కార్టీ ఒక్కసారిగా క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. 2016లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మెక్‌కార్టీ.. ఇప్పటి వరకు 42 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. ఐర్లాండ్‌ టీమ్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. 42 వన్డేల్లో 171 పరుగులు, 69 వికెట్లు ఉన్నాయి. అలాగే 44 టీ20ల్లో 320 రన్స్‌, 42 వికెట్లు ఉన్నాయి. మరి టీమిండియా బౌలర్లను మెక్‌కార్టీ సమర్థవంతంగా ఎదుర్కొవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియాకి చాలా ఈజీగా ఆడేస్తున్నారు! అదే జరిగితే.. బుమ్రా ఇంటికే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి