iDreamPost

loan recovery agents లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తే, బ్యాంకుల మీద చ‌ర్య‌లు, ఏజెంట్ల ఆగ‌డాల‌కు ఆర్‌బీఐ అడ్డుక‌ట్ట‌

loan recovery agents లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తే, బ్యాంకుల మీద చ‌ర్య‌లు, ఏజెంట్ల ఆగ‌డాల‌కు ఆర్‌బీఐ అడ్డుక‌ట్ట‌

బ్యాంక్ లోన్లు తీసుకొని, నెల‌వారీ ఈఎంఐలు క‌ట్ట‌లేనివారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చ‌ల్ల‌టి క‌బ‌రుచెప్పింది. రికవరీ ఏజెంట్లు ( recovery agents (RAs)ల‌ ఆమోదించలేని పద్ధతులు అంటే బెదిరింపులు పెరుగుతున్న ఘటనలతో, ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. మార్గదర్శకాల పరిధిని పొడిగించిన ఆర్బీఐ, గడువు ముగిసిన రుణాల రికవరీ కోసం, రుణగ్రహీతలను ప‌రిమిత స‌మయాల్లో మాత్ర‌మే కాల్ చేయాల‌ని, బెదిరించ‌కూడ‌ద‌ని తేల్చిచెప్పింది.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(regional rural banks,), సహకార బ్యాంకులు(co-operative banks), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు)(non-banking financial companies (NBFCs)), అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఎఆర్‌సి)(asset reconstruction companies (ARCs)తోపాటు ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లతో(All India financial institutions) సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు ఈ సూచనలు వర్తిస్తాయని ఆర్‌బిఐ సర్క్యులర్‌లో తెలిపింది.

రిక‌వ‌రీ ఏజెంట్ల‌ అవుట్‌సోర్సింగ్ కార్యకలాపాలకు అంతిమ బాధ్యత వారిపైనే ఉంటుందని, రికవరీ ఏజెంట్లతో సహా వారి సర్వీస్ ప్రొవైడర్ల చర్యలకు వారే బాధ్యత వహించాల్సిందేన‌ని ఆర్‌బిఐ తెలిపింది.

రిక‌వ‌రీ ఏజెంట్లు(RE) లేదా వారి ఏజెంట్లు లోన్ల వ‌సూలు ప్రయత్నాల్లో భాగంగా, ఎవ‌రినీ మౌఖికంగా లేదంటే శారీరకంగా బెదిరించ‌కుండా క‌ట్టుదిట్టం చేయాల‌ని RBI తెలిపింది.

రుణగ్రహీతల కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కి కాల్ చేయ‌డం, మొబైల్ , సోషల్ మీడియా ద్వారా అస‌భ్య‌క‌రంగా మెసేజ్ లు పంపించ‌డం, బెదిరించడం, అనామక కాల్‌లు చేయడం, ఎప్పుడుప‌డితే అప్పుడు వ‌రుస‌గా కాల్స్ చేస్తుండం వంటివి చేయ‌కూడ‌ద‌ని తేల్చిచెప్పింది. ఉదయం 8:00 గంటల ముందు, సాయంత్రం 7:00 గంటల తర్వాత కాల్ చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. ఆర్‌ఈలు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి