iDreamPost

బ్యాంక్ మేనేజర్ నిర్వాకం.. కుదువపెట్టిన బంగారంతో వడ్డాణం..!

Bank Manager Cheating: కష్టపడి దాచుకున్న సొమ్ము బ్యాంకుల్లో భద్రపర్చుకుంటారు. కానీ.. కొంతమంది సిబ్బంది చేస్తున్న నిర్వాకం వల్ల బ్యాంకులపై నమ్మకం పోతుంది

Bank Manager Cheating: కష్టపడి దాచుకున్న సొమ్ము బ్యాంకుల్లో భద్రపర్చుకుంటారు. కానీ.. కొంతమంది సిబ్బంది చేస్తున్న నిర్వాకం వల్ల బ్యాంకులపై నమ్మకం పోతుంది

బ్యాంక్ మేనేజర్ నిర్వాకం.. కుదువపెట్టిన బంగారంతో వడ్డాణం..!

బ్యాంకు అనేది ఒక ఆర్థిక సంస్థ, వినియోగదారులు తమ డబ్బును సురక్షితంగా దాచుకోవడం.. అవసరమైనపుడు తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకులు అంటే ప్రజలు కష్టపడి దాచుకునే డబ్బు, బంగారం, వజ్రాలకు భద్రత కల్పిస్తూ.. వాటికి జవాబుదారీగా ఉండాలి. కానీ ఇటీవల కొన్ని బ్యాంకులు, సొసైటీ కి చెందిన అధికారులు, సిబ్బంది ఇంటి కాగితాలు, పొలం కాగితాలు, బంగారం ఆభరణాలు తీసుకొని కొంత రుణం ఇచ్చి.. వాటిని తమ సొంతానికి వాడుకుంటూ మోసాలకు తెగబడుతున్నారు. కస్టమర్లు అడిగితే కుంటిసాకులు చెబుతున్నారు.. అలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కష్టపడ్డ సొమ్మును బ్యాంకుల్లో దాచుకుంటే భద్రంగా ఉంటుందని భావిస్తారు.. కానీ ఇటీవల కొన్ని సంఘటనలు అసలు బ్యాంకు అంటే భయపడే పరిస్తితి ఏర్పడుతుంది. తాజాగా గంగూరు యూనియన్ బ్యాంక్ శాఖ మేనేజర్ గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న ప్రభావతి సొంత ఊరు నూజివీడు మండలం మర్రిబంధం. గత కొంత కాలంగా ప్రభావతికి భర్తతో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మర్రిబంధం గ్రామానికి చెందిన యోగేశ్వరరావు అనే వ్యక్తికి హైదరాబాద్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ లో అకౌంట్.. గుంగూరు శాఖకు ట్రాన్స్ వర్ చేయించింది. అయితే యోగేశ్వరరావు తన వద్ద 380 గ్రాముల బంగారం ఉందని.. దాన్ని దాచుకోవడానికి బ్యాంక్ లో లాకర్ అడిగాడు. లాకర్ కావాలంటే బంగారం దాయడం కన్నా తనఖా పెట్టుకుంటే రుణం తీసుకోవొచ్చు.. గోల్డ్ సెఫ్టీగా ఉంటుందని సలహా ఇచ్చింది ప్రభావతి.

ఈ క్రమంలోనే యోగీశ్వరరావు తన వద్ద ఉన్న బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. గత ఏడాది నవంబర్ లో తాను తీసుకున్న రుణం తాలూకు డబ్బు బ్యాంక్ లో తిరిగి చెల్లించాడు. అనంతరం బ్యాంకులో పెట్టిన బంగారు ఆభరణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దే ఉన్నాయని ప్రభావతి చెప్పింది. ఆ విషయం గురించి మాట్లాడేందుకు తన ఇంటికి రమ్మని చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారం గురించి అడిగాడు. నువ్వంటే నాకు ఇష్టం అని, నన్ను పెళ్లి చేసుకుంటావా అని యోగీశ్వరరావుకి ప్రపోజల్ చేసింది ప్రభావతి… దాంతో యోగేశ్వరరావుకి మతిపోయింది. ఈ ఘటనపై యోగేశ్వరరావు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి