iDreamPost

Bangarraju : వలిమై అవుట్ – బంగార్రాజుకు భలే టైం

Bangarraju : వలిమై అవుట్ – బంగార్రాజుకు భలే టైం

సంక్రాంతి సీజన్ ని ఏదేదో ఊహించుకుంటే ఓమిక్రాన్ పుణ్యమాని ఏదేదో అవుతోంది. భారీ సినిమాలతో కిక్కిరిసిపోయే హౌస్ ఫుల్ కలెక్షన్లతో సందడిని కోరుకున్న బాక్సాఫీస్ వద్ద ఈసారి చిన్న సినిమాల పోటీతో సర్దుకుంటోంది. నాగార్జున బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ భారీ చిత్రం ఇంకేదీ లేదు. డిజె టిల్లు, రౌడీ బాయ్స్ వెనుక పెద్ద బ్యానర్లు ఉన్నాయి కానీ మౌత్ టాక్ బాగా వస్తే తప్ప జనం వీటి వైవు చూసే అవకాశాలు తక్కువ. కాకపోతే హాలిడే సీజన్ కాబట్టి ఏదో ఒక సినిమా చూడనిదే సంతృప్తి చెందని ప్రేక్షకుడు ఇవే ఆప్షన్లు అనుకుంటే ఓ వారం రోజులు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్ ఛాయస్ బంగార్రాజే.

నిన్న సాయంత్రం అజిత్ వలిమై తప్పుకోవడం మన సినిమాలకు చాలా ప్లస్ కానుంది. అజిత్ కు ఇక్కడ పెద్ద మార్కెట్ లేకపోయినా పాన్ ఇండియా సినిమాలన్నీ వాయిదా పడటంతో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఇక్కడ కూడా భారీ ఓపెనింగ్ వచ్చేది. పైగా హిందీలోనూ చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేవు. కాబట్టి మాస్ ఆడియన్స్ ఓ లుక్ వేసేవారు. కట్ చేస్తే వలిమై కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఇది వస్తుందనే ఉద్దేశంతోనే విశాల్ సామాన్యుడు మళ్ళీ జనవరి 26కి వెళ్లిపోయింది. సో గ్రౌండ్ కంప్లీట్ గా ఓపెన్ అయ్యింది, ఒకవేళ బంగార్రాజుకు తమిళనాడులోనూ మంచి రెస్పాన్స్ వస్తే ఫిగర్స్ లో మార్పులు గట్టిగా ఉంటాయి.

ఈ లెక్కన నాగార్జున మొదటిసారి 100 కోట్ల గ్రాస్ కళ్లజూసినా ఆశ్చర్యం లేదు. అఖండ అన్ సీజన్లో సోలోగా వచ్చి 70 కోట్లను దాటేసింది. ఇంకా రన్ కొనసాగుతోంది. ఫైనల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చెప్పలేం. ఇది మాస్ ఎంటర్ టైనర్. కానీ బంగార్రాజు మాస్ ప్లస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసిన ఫ్యామిలీ మూవీ. సోగ్గాడే చిన్ని నాయన తరహాలో టాక్ వస్తే మాత్రం టికెట్ల కోసం జాతర జరగడం ఖాయం. కానీ ఆందోళన కలిగించే అంశం మరొకటుంది. కేసులు పెరిగిపోతున్నాయి. మహేష్ బాబు, లక్ష్మి మంచు లాంటి సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ దాకా అందరూ తిరిగి కరోనా బారిన పడుతున్నారు. మరి బంగార్రాజుకి ఇది అడ్డంకిగా మారకపోతే అదృష్టం

Also Read : Mahesh Babu : మహేష్ బాబుకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్ లో సూపర్ స్టార్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి