iDreamPost

జైలర్ ఫార్ములా ఫాలో అవుతున్న బాలయ్య! ఫ్యాన్స్ కు పండగే!

జైలర్ ఫార్ములా ఫాలో అవుతున్న బాలయ్య! ఫ్యాన్స్ కు పండగే!

జైలర్.. ఇప్పుడు సౌత్ ఇండియా సినీ లోకాన్ని ఊపేస్తున్నపేరు ఇది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినాని చాటుతూ ఇప్పటికే ఈ మూవీ 400 కోట్లకి పైగా వసూలు చేసేసింది. ఇక తమిళ ఇండస్ట్రీ రికార్డుగా నిలవడానికి జైలర్ ఎంతో దూరంలో లేదు. అయితే.. జైలర్ సక్సెస్ ఒక్క రజనీకే మేలు చేయలేదు. ఇప్పుడు సౌత్ ఇండియా సీనియర్ హీరోలు అందరికీ ఈ మూవీ ఓ సక్సెస్ ఫార్ములాగా మాదిరిపోయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జైలర్ లో రజనీ తన వయసుకి తగ్గ పాత్రలో కనిపించి మెప్పించాడు. కథని దాటి ఎక్కడా తన మైలేజ్ కోసం ప్రయత్నం చేసింది లేదు. ఆఖరికి ఓ మామూలు నటుడి షూస్ కూడా తలైవా క్లీన్  చేశారు. కానీ.., యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం తన విశ్వరూపమే చూపించేశారు. నిజానికి సీనియర్ హీరోలకి ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ అతకినట్టు సరిపోతాయి. కాబట్టే.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ జైలర్ సక్సెస్ ఫార్ములాని వాడేయడానికి సిద్దమయ్యారట.

బాలకృష్ణ ప్రస్తుతం “భగవంత్ కేసరి” మూవీలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన తన వయసుకి తగ్గ పాత్రలో  కనిపిస్తున్నారు. అన్నిటికీ మించి ఈ మూవీలో డాటర్ సెంటిమెంట్ ఉండబోతుంది అని టాక్. దీనితో పాటు.. నెల్సన్ లానే అనిల్ రావిపూడికి కూడా కామెడీపై మంచి పట్టు ఉంది. కాబట్టి జైలర్ లో రజనీలా కథ కోసం ఎంత తగ్గడానికైనా బాలయ్య సిద్ధమైనట్టు సమాచారం. కాకపోతే.., జైలర్ లో రజనీకాంత్ వెనక ఉండి షో అంతా నడుపుతాడు. ఇక్కడ బాలకృష్ణ మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ లో నేరుగా తానే బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. డైలాగ్స్, ఫైట్స్ ఎలాగో  బాలయ్యకి కొట్టిన పిండి. కాబట్టి సినిమాలో అనవసరపు మాస్ ఎలివేషన్స్ జోలికి పోకుండా.. కథను బట్టి బాలకృష్ణ క్యారెక్టర్ బిహేవ్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్, అజిత్ వంటి స్టార్స్ తమ వయసుకి తగ్గ పాత్రలలో కనిపించి, కలెక్షన్స్ కొల్లగొడుతున్నారు. తెలుగులో  సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య, నాగార్జున, వంటి స్టార్స్ ఇలాంటి టెంప్లేట్ క్యారెక్టర్స్ లో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వెంకటేష్ ఇప్పటికే ఇలాంటి రోల్స్ చేసినా అవేవి మాస్ లైన్స్ కావు. మరి.. తెలుగులో తొలిసారి బాలయ్య ఈ ప్రయోగానికి సిద్దమవ్వడం విశేషం. ఒకవేళ.. ఈ ప్రయత్నంలో బాలకృష్ణ సక్సెస్ అయితే.. మిగతా సీనియర్ హీరోస్ కూడా తమతమ వయసుకి తగ్గ పాత్రల్లో కనిపించడానికి సిద్ధమయ్యే అవకాశం లేకపోలేదు. మరి.. జైలర్ సక్సెస్ ఫార్ములాతో నందమూరి బాలకృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి